More

    ఏపీ డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు

    టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. తక్షణం లా అండ్ ఆర్డర్ పై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, ఇటీవల ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉండుంటే రేపల్లె అత్యాచార ఘటన జరిగి ఉండేది కాదని అన్నారు. ఏపీలో అటవిక పాలన కొనసాగుతోందని, ప్రజలకు ఏ మాత్రం భద్రత లేదన్నారు. ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటుందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు విచ్ఛిన్నమయ్యాయని చెప్పడానికి పెరుగుతున్న క్రైమ్ రేటే నిదర్శనమన్నారు. గత కొన్నిరోజుల వ్యవధిలో రాష్ట్రంలో జరిగిన నేరాల వివరాలను, మీడియా క్లిప్పింగ్స్ ను, వీడియోలను కూడా తన లేఖలో పొందుపరిచారు.

    రాష్ట్రంలో వైసీపీ గూండాలు రెచ్చిపోతుంటే, పోలీసు శాఖ వారిని అదుపుచేయలేని పరిస్థితిలో ఉందని, రాష్ట్రంలో మద్యం, గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. వాటి ద్వారానే హింస, నేరాలు కూడా పెరుగుతున్నాయని, గంజాయి వ్యవహారంలో వైసీపీ నేతల పాత్ర ఉన్నప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. ఏలూరు జిల్లాలో జి.కొత్తపల్లి గ్రామ వైసీపీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ మృతికి వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణమని మృతుడి భార్య ఆరోపిస్తోందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వివిధ నేరాలకు కారకులైన నిందితులతో పాటు, నేరాలను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులపైనా కఠినచర్యలు తీసుకోవాలని చంద్రబాబు తన లేఖలో డిమాండ్ చేశారు. అనంతపురంలో పెన్షన్ అడిగిన పాపానికి పోలీసు అధికారి టిడిపి కార్యకర్తపై దాడి చెయ్యడం డిపార్ట్మెంట్ లో పరిస్థితికి అద్దం పడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పట్టపగలు గన్ తో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోటలో బ్యాంక్ దోపిడీ జరిగిందన్నారు. నిందుతుల పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు…లా అండ్ ఆర్డర్ అమలు పై పోలీసు శాఖ దృష్టిపెట్టాలని చంద్రబాబు సూచించారు.

    Trending Stories

    Related Stories