వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు..!

0
934

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విలేకరులు సమావేశంలో వెక్కివెక్కి ఏడ్చారు. తన కుటుంబ సభ్యులను సైతం కామెంట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లో లేరని.. ఇల్లుదాటి ఎప్పుడూ బయటికి రాలేదన్నారు. అలాంటి వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని.. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. ఇంత బాధను తట్టుకోలేకపోతున్నానని కన్నీటిపర్యంతమయ్యారు.

తనను బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురి చేసినా భరించానన్నారు. కానీ, కటుంబు సభ్యులను కూడా అవమానానికి గురిచేయడాన్ని భరించలేకపోతున్నానని అన్నారు. అధికారంలో వున్నప్పుడు తాను ఎవర్నీ కించపరచలేదని.. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బాధ్యతగా భావించాను అన్నారు. ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అసెంబ్లీలో తన తల్లిని అవమానించారని.. తర్వాత తప్పు జరిగిందని క్షమాపణ కోరారన్నారు.

ప్రజలు ఓట్లేసి 151 సీట్లు వైసీపీకిచ్చి.. మాకు 23 స్థానాలు ఇచ్చినా తాను బాధపడలేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని.. ఇది కౌరవ సభ.. గౌరవం లేని సభ అంటూ చురకలు అంటించారు. జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద నేతలతో పని చేశామని.. ప్రజల కోసం రాజకీయం చేస్తున్నామని గర్వంగా ఫీలయ్యేవాళ్లమని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం, నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అన్ని విధాల అవమానిస్తోంది అన్నారు. రెండున్నర సంవత్సరాలుగా తనపై మాట్లాడారు.. బండ బూతులు తిట్టారు. అనేక మంది నాయకులతో తాను పని చేయడం జరిగిందని, ఎన్నికల్లో గెలిచాం..ఓడిపోయామన్నారు. తమ వ్యక్తిత్వాలను కించపరిచేలా వైసీపీ ప్రవర్తించిందని, ఓడినప్పుడు కుంగిపోలేదు.. గెలిచినప్పుడు రెచ్చిపోలేదన్నారు. ఎంతో మంది సీనియర్ రాజకీయ నేతలను.. ముఖ్యమంత్రులను చూశాను కానీ.. ఇంత దారుణంగా ప్రవర్తించే వారిని తన రాజకీయ జీవితంలో తొలిసారి చూస్తున్నాను అన్నారు చంద్రబాబు నాయుడు.

అంతకు ముందు అసెంబ్లీలో కూడా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యులు శృతి మించి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైసీపీపై ప్రజా క్షేత్రంలోనే పోరాడతానని.. తన ధర్మ పోరాటానికి ప్రజలు సహకరించాలన్నారు. ప్రజల మద్దతుతో మళ్లీ సీఎంగా అసెంబ్లీలో అడుగు పెడతానన్నారు చంద్రబాబు. సభలో జరిగిన పరిణామాలపై ఆవేదనతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని వెల్లడిస్తున్నప్పుడు చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ వెంటనే అసెంబ్లీ సమావేశాలను బవిష్కరించి.. విజయవాడలో మీడియా సమవేశం పెట్టారు. కానీ అక్కడ తన్నుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్చారు చంద్రబాబు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

3 + nine =