అప్పుడే అలర్ట్ చేసేస్తున్న చంద్రబాబు

0
733

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని.. పార్టీ శ్రేణులు అందుకు సిద్దంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపును ఇచ్చారు. పార్టీ గ్రామ, మండల కమిటీలతో ఆయన మంగళవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బాదుడే ..బాదుడు , సభ్వత్వ నమోదు, ఓటర్‌ వెరిఫికేషన్‌, మహానాడు తదితర అంశాలపై పార్టీ శ్రేణులతో సమీక్షించారు.

రాష్ట్ర ప్రజల్లో రోజురోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని.. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమనే విషయం జగన్‌కు అర్థమవుతోందని అన్నారు. జగన్‌ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు బూటకమని, వర్గాలతో తేడా లేకుండా అందరిలోనూ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. అందుకే సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు టీడీపీపైనే ఆశలు పెట్టుకున్నారని.. గ్రామాల్లో టిడిపికి స్వాగతాలు, గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసిపి నేతలకు నిలదీతలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుఈత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారని.. టీడీపీ నేతలు గ్రామస్థాయి వరకూ ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా ఇంటింటికీ వెళ్లాలన్నారు.

ప్రజల భవిష్యత్‌కు టీడీపీ భరోసాగా కనిపిస్తోందని.. తన పర్యటనల్లో ఆ విషయాలన్నీ తెలుస్తున్నాయని చంద్రబాబు అన్నారు. టీడీపీకి ఇదొక మంచి అవకాశం అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమనే విషయం సీఎం జగన్‌కు అర్థమవుతోందని.. 2024 కంటే ముందుగా ఎన్నికలు వచ్చినా వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. కేడర్, లీడర్ అన్నింటికి సిద్దపడి ఉండాలని అన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు టీడీపీ ఇప్పుడు ఒక హోప్ గా కనిపిస్తోందని, అందుకే టీడీపీకి ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు చంద్రబాబు.