More

    న్యాయం గెలిచింది.. న్యాయమే గెలుస్తుంది అంటున్న చంద్రబాబు

    టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్ రిమాండ్ కు విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో అయ్యన్నతో పాటు రాజేశ్ కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి ఈ కేసులో సీఐడీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టవచ్చంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2 సెంట్ల భూమి ఆక్రమణకు అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారన్న ఆరోపణల కింద గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు రాజేశ్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రానికి విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఈ కేసులో నిందితులపై మోపిన ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని తేల్చారు. దీంతో నిందితులకు అక్కడికక్కడే బెయిల్ మంజూరు చేయడంతో పాటు నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సీఐడీని కోర్టు ఆదేశించింది.

    విశాఖ మెట్రోపాలిటన్ కోర్టు తీర్పుపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయం గెలిచింది.. న్యాయమే గెలుస్తుంది అంటూ ఆయన తెలిపారు.

    Trending Stories

    Related Stories