More

    అదే జరిగితే.. జైలు నుంచి రాజా సింగ్ విడుదల

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ లోని చర్లపల్లి జైల్లో ఉన్నారు. ఆయనపై పీడీ యాక్ట్ నమోదైన నేపథ్యంలో పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు సమావేశం జరిగింది. బోర్డు ఛైర్మన్ భాస్కరరావు, మరో ఇద్దరు జడ్జిల సమక్షంలో విచారణ జరిగింది. ఈ సమావేశానికి రాజాసింగ్ భార్య ఉషా బాయ్ తో పాటు వెస్ట్ జోన్ డీసీపీ, షాహినాయత్ గంజ్, మంగళ్ హాట్ పోలీసులు పాల్గొన్నారు. రాజాసింగ్ చర్లపల్లి జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నాడు. విచారణ సందర్భంగా తనపై పీడీ యాక్టును నమోదు చేయడంపై రాజాసింగ్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. నాలుగు రోజుల్లో పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు ఆదేశాలను జారీ చేసే అవకాశం ఉంది. రాజాసింగ్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, పీడీ యాక్ట్ నమోదును బోర్డు సమర్థిస్తే తాము హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. పీడీ యాక్ట్ ను బోర్డు వ్యతిరేకిస్తే జైలు నుంచి రాజా సింగ్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

    ఎమ్మెల్యే రాజాసింగ్ ను ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద మంగళహాట్ పోలీసులు ఆగస్టు 25వ తేదీన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. దేశవ్యాప్తంగా 101 కేసులు నమోదయ్యాయని.. మత ఘర్షణలకు దారి తీసేలా రాజాసింగ్ వ్యాఖ్యలు వున్నాయని పోలీసులు తెలిపారు. మంగళ్‌హాట్, షాహినాయత్ గంజ్‌లో రాజాసింగ్‌పై రౌడీషీట్లు తెరిచారని.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయని పోలీసులు చెప్పారు. వివాదాస్పద కామెంట్లు చేయవద్దని చాలా సార్లు హెచ్చరించినా పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. పదే పదే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందునే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశామని అంటున్నారు పోలీసులు.

    Trending Stories

    Related Stories