National

కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరుడికి ఫైన్ వేసిన పోలీసు.. ఆ తర్వాత

ఓ పోలీసు అధికారిని అకారణంగా విధుల నుండి తొలగించడం రాజస్థాన్ రాష్ట్రంలో వివాదాస్పదమైంది. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే అనుచరుడికి ఫైన్ వేశారనే కారణాలతో సదరు పోలీసు అధికారిని విధుల నుండి తప్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేంద్ర బుదానియా పోలీసును తప్పించే చర్యల వెనుక ఉన్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే అనుచరుడు,తారానగర్ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ఒకే బైక్ మీద మరో ఇద్దరితో కలిసి ట్రిపుల్ రైడింగ్ వెళుతూ ఉండగా.. పోలీసు అడ్డుకుని ఫైన్ విధించాడు. దీన్ని అవమానంగా భావించిన సదరు అనుచరుడు ఎమ్మెల్యేకు చెప్పి మరీ పోలీసును విధుల నుండి తప్పించినట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ లీడర్ కు, సదరు పోలీసు అధికారికి వాగ్వాదం చోటు చేసుకున్న ఓ వీడియో వైరల్ అయ్యింది. అందులో ఫైన్ ఎందుకు విధిస్తున్నారు అని కాంగ్రెస్ నేత పోలీసుతో గొడవ పెట్టుకోవడం స్పష్టంగా తెలుస్తోంది. సదరు రాజకీయ నాయకుడికి చలాన్ విధించారు. హెల్మెట్ లేకుండా.. సరైన డాక్యుమెంట్లు లేకుండా తారానగర్ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రియాంక బానో భర్త బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ తో వెళుతూ పోలీసు కంటబడడంతో ఫైన్ విధించారు.

హెడ్ కానిస్టేబుల్ విజేందర్ సింగ్ వారిని ఆపి లాక్ డౌన్ సమయంలో ఇలా వెళ్లడం తప్పు అంటూ చలానా విధించడమే కాకుండా.. బైక్ ను సీజ్ చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేను అక్కడి కౌన్సిలర్లు వెళ్లి కలిశారు. సదరు కానిస్టేబుల్ ను విధుల నుండి తప్పించాలని ఎమ్మెల్యే మీద ఒత్తిడి చేయడంతో చురూ ఎస్పీ విజేందర్ సింగ్ ను విధుల నుండి తప్పించి పోలీసు లైన్లకు ట్రాన్స్ఫర్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

5 × two =

Back to top button