Sports

ఇకనైనా ఆ జంటపై చేస్తున్న ప్రచారాన్ని ఆపుతారా..?

టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ విడాకులు తీసుకోనున్నాడనే కథనాలు ఇటీవల వచ్చాయి. చహల్, భార్య ధనశ్రీల సోషల్ మీడియా పోస్టులే ఈ కథనాలకు కారణమయ్యాయి. కొత్త జీవితం ప్రారంభం కానుంది అంటూ చహల్ పోస్టు చేయగా, తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి చహల్ పేరును తొలగించింది ధనశ్రీ. చహల్ 2020లో దంతవైద్యురాలు ధనశ్రీని వివాహం చేసుకున్నాడు. ధనశ్రీ డెంటిస్ట్ మాత్రమే కాదు యూట్యూబర్, కొరియోగ్రాఫర్ కూడా. పెళ్లికి ముందు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ జంట విడిపోనుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై చహల్ స్పందించాడు. తమ వైవాహిక బంధంపై వస్తున్నవన్నీ పుకార్లేనని, దయచేసి వాటిని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశాడు. వాటికి ఇంతటితో ముగింపు పలకాలని కోరాడు. ప్రతి ఒక్కరి జీవితం ప్రేమతో వెలిగిపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపాడు.

ఇక ధనశ్రీవర్మ కూడా ఇన్ స్టా గ్రామ్ లో స్పందించింది. ‘‘మా బంధం గురించి వస్తున్న పుకార్లు వేటినీ కూడా నమ్మవద్దని వినయపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి వీటికి ముగింపు పలకండి. ప్రతి ఒక్కరి జీవితాలు ప్రేమతో వెలిగిపోవాలి’’ అని పోస్ట్ పెట్టింది. కాబట్టి ఇవన్నీ వదంతులేనని తేలిపోయాయి.

Related Articles

Back to top button