ఓటీటీలకు కళ్లెం.. వచ్చేస్తుంది పవర్ ఫుల్ చట్టం

0
661

టెక్నాలజీ.. ఇది పెరుగుతున్న కొద్ది మనిషికి మేలెంత చేస్తుందో.. కీడు అంతే చేస్తుంది అనేది నిర్వివాదాంశం. ముఖ్యంగా న్యూస్ వెబ్ సైట్లు, సోషల్ మీడియా, ఓటీటీ సర్వీసులూ టెక్నాలజీ అడ్వాన్స్ మెంట్ తో దూసుకుపోతున్నాయి. ప్రజలు కూడా శాటిలైట్ బేస్డ్ ప్లాట్ ఫాం లను వదిలి అంతర్జాల వేదికలకే అలవాటు పడుతున్నారు. అయితే వీటిపై ఒక నియంత్రణ అంటూ లేకుండా పోయింది ఇన్నాళ్లూ.. దానికి ఇక ఎండ్ కార్డ్ పడింది. కేంద్రం ప్రభుత్వం తాజాగా దానికి సంబంధించిన ఖచ్చితమైన చట్టాలతో పూర్తి వివరాలను వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇటీవల కాలంలో మన దేశం, ధర్మంపై.. మన ఆచార వ్యవహారాలపై… కుట్రపూరితంగా తీసే సినమాలు, రాసే కథనాలు ఎక్కువయిపోయాయి. వాటిని నియంత్రించేందుకే మోదీ సర్కారు సంచలన ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనలతో ఫేక్ సమాచారం కట్టడి జరగునుందని టెక్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ వెబ్ సైట్లు, సోషల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ముఖ్యంగా ఈ మూడింటి వేదికగా కొన్ని చర్యలు, చిత్రాలు చాలా అభ్యంతరకరరీతిలో ఉండటంతో వీటి కట్టడికి కేంద్రం సిద్ధమైంది. కొంత కాలంగా దీనిపై సాగిన కసరత్తు ఎట్టకేలకు నిబంధనల రూపంలో బయటికొచ్చాయి. డిజిటల్ కంటెంట్ ను కట్టడి చేసేందుకుగానూ కేంద్ర సమాచార, ఐటీ చట్టాల్లో కీలకమైన సవరణలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతానికి ముసాయిదాలుగా ఉన్న ఈ సవరణలు చట్టంగా ఆమోదం పొంది, అమలులోకి వస్తే డిజిటల్ ప్లాట్ ఫామ్ లపై కేంద్రానికి నియంత్రణ లభించినట్లవుతుంది. ఫేక్ న్యూస్ కట్టడి కోసమే రూపొందించినట్లుగా చెబుతోన్న కొత్త నిబంధనల ముసాయిదా వివరాలను కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ లు మీడియాకు వెల్లడించారు..

సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా కొత్త నిబంధనలు ఉంటాయని, అభ్యకర పోస్టులను తక్షణం గుర్తించడం, ఇతరులను అగౌరవపరిచే రాతలపై కఠిన చర్యలు తీసుకోవడం లాంటి వెసులుబాటులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

ఇక ఐటీ చట్టంలో సవరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన కొత్త నిబంధనల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

•             ఇవి న్యూస్ వెబ్ సైట్లు, సోషల్ మీడియా, ఓటీటీలు మూడింటికీ వర్తిస్తాయి.

•             వ్యక్తులు లేదా సంస్థలకు పరువుకు భంగం కలిగించే, అసభ్య, వివక్షా పూరితమైన, మైనర్లకు హానికరమైన, దేశ సార్వభౌమత్వం, రక్షణ, భద్రత, సమైక్యతకు ముప్పు కలిగించే డిజిటల్ కంటెంట్ పై నిషేధం.

•             నేరపూరితమైన లేదా అక్రమమైన కంటెంట్ అని తమ దృష్టికి వచ్చిన 36 గంటల్లో లేదా కోర్టు ఆర్డర్ ప్రకారం ఆ పోస్టులను సోషల్ మీడియా సైట్లు తొలగించాలి. తప్పుడు సందేశాన్ని ముందు ఎవరు సృష్టించారో సోషల్ మీడియా సైట్లే నిర్ధారించాలి. ఫిర్యాదు వచ్చిన 72 గంటల్లో సైట్లు, సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ అధీకృత సంస్థకు వెంటనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

•             డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఓటీటీ సంస్థలు ఫిర్యాదులను నెలలోపు పరిష్కరించేందుకు ఓ గ్రీవెన్స్ ఆఫీసర్ ను నియమించుకోవాలి.

•             ఫిర్యాదు చేసిన 24 గంటల్లో అక్రమమైన లేదా నేరపూరితమైన కంటెంట్ ను వార్తా సంస్థలు, ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీలు తొలగించాలి.

•             కోడ్ ఆఫ్ ఎథిక్స్ అమలుకు మూడు దశల వ్యవస్థ ఏర్పాటు ఉంటుంది. స్వీయ నియంత్రణ, స్వీయ నియంత్రణ సంస్థల అధీనంలో స్వీయ నియంత్రణ, ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థలుగా అవి ఉంటాయి.

•             కోడ్ ఆఫ్ ఎథిక్స్ కు సంబంధించి ఏవైనా ఉల్లంఘనలు జరిగితే ప్రభుత్వానికి ప్రజలు ఫిర్యాదు చేసేలా ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి 15 రోజుల్లోగా సమస్యల పరిష్కారం చూపుతారు.

చూడాలి.. పూర్తి స్థాయిలో ఈ చట్టం రూపుదాల్చితే ఎంత వరకు ఫేక్, ద్వేషపూరిత, అభ్యంతరకర కంటెంట్ లనుండి మనం బయటపడతామన్నది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here