సెంట్రల్ పవరేంటో చూపిన మోదీ ప్రభుత్వం

0
786

బెంగాల్ లో ఎన్నికలు ముగిసి.., ఫలితాలు వచ్చి నెల రోజులు పూర్తి కావస్తోంది. మమతా బెనర్జీ మూడోసారి సీఎం అయ్యారు.అయితే పాలనపై దృష్టి పెట్టాల్సిన మమతా బెనర్జీ మళ్లీ తన మార్కు రాజకీయాలు మొదలు పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో యాస్ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ పర్యటించారు. ఒడిశాతోపాటు బెంగాల్ లోనూ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగాల్ లో అధికారులతో సహయ కార్యక్రమాలకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పీఎంవో ఆ రాష్ట్ర సీఎస్ ను ఆదేశించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ తోపాటు సీఎం మమతా బెనర్జీని, అలాగే విపక్ష నేత సుబేందు అధికారిని సైతం ఆహ్వానించారు. అయితే మొదట సీఎస్ మాత్రమే ఈ సమావేశానికి వస్తారని చెప్పిన మమతా ఆ తర్వాత సమీక్షా సమావేశానికి తాను కూడా హాజరవుతున్నట్లు ప్రకటించారు. మొత్తంగా బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత పీఎం మోదీ, మమతా బెనర్జీ అధికారికంగా భేటీకావడం కూడా ఇదే తొలిసారి. దీంతో ఈ భేటీపై నేషనల్ మీడియాతోపాటు ప్రాంతీయ మీడియా కూడా ఆసక్తిగా ఎదురూచూసింది.

బెంగాల్ రాష్ట్రానికి ఆపన్న హస్తం అందించడం కోసం స్వయంగా ప్రధాని మోదీ వచ్చారు. అంతేకాదు ఈ సమీక్ష సమావేశం ఎయిర్ పోర్టులోనే  ఏర్పాటు చేశారు. సీఎం మమతా బెనర్జీ మాత్రం సమీక్ష సమావేశానికి 30 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. తుపాన్ నష్టానికి సంబంధించిన కొన్ని పత్రాలను పీఎం మోదీకి అందించి.. ఆ వెంటనే తిరుగుముఖం పట్టారు. తనకు మరోక చోట కార్యక్రమం ఉందని ఏమీ పట్టనట్లుగా వెళ్లయారు మమతా బెనర్జీ.

మమత చర్యపై బీజేపీ మండిపడింది. ఉద్దేశ్యపూర్వకంగానే పీఎం మోదీని మమతా బెనర్జీ అవమానించారని ఆరోపించింది. ప్రధాని మోదీ సమావేశానికి సీఎస్​తో సహా, ఇతర ప్రభుత్వశాఖల ఉన్నతాధికారుల్ని సైతం హాజరుకావొద్దని మమతా బెనర్జీ ఆదేశించినట్లు ప్రచారం జరిగింది. పీఎం మోదీని మమతా అరగంటపాటు వెయిట్ చేయించారనే వార్తను నేషనల్ మీడియా బ్రేకింగ్ న్యూస్ గా ప్రసారం చేశాయి. అయితే నేషనల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ గా నడిచిన ఈ వార్త రాత్రి అయ్యేసరికి సరికొత్త మలుపు తీసుకుంది.

అది… బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అల్పన్ బందోపాధ్యాయను కేంద్ర ప్రభుత్వం రీకాల్ చేసింది. నిజానికి బదోపాధ్యాయ ఉద్యోగ విరమణ గడువును కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల క్రితమే మూడు నెలలపాటు పొడిగించింది కూడా. యాస్ తుపాన్ సమీక్ష సమావేశం నేపథ్యంలో సీఎస్ వ్యవహారించిన తీరుతో  మోదీ ప్రభుత్వం సైతం పునరాలోచనలోపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సేవలను కేంద్రంలో వినియోగించుకోవాలనే తలంపుతో, వెనక్కి పిలిపించినట్లుగా బీజేపీ సర్కిళ్లల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే పీఎం మోదీ సమావేశంలో తాను వ్యవహారించిన తీరుకు ప్రతీకారంగానే కేంద్రం సీఎస్ ను రీకాల్ చేసిందని మమతా బెనర్జీ ప్రభుత్వం భావిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇలా ఎప్పుడూ జరగలేదని తృణమూల్ నేతలు కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో బీజేపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కూడా ఏ ప్రధానికి బెంగాల్ లో ఇంతటి అవమానం జరగలేదని.. ఇప్పుడు మమతా మూలంగా జరిగిందని వాపోయారు.

అయితే బెంగాల్ నుంచి ఐఏఎస్ అధికారులను వెనక్కి పిలవడమనే ఎన్నికల ముందు నుంచే జరుగుతోందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. అయితే అల్పన్ బందోపాధ్యాయను రూల్స్ ప్రకారమే వెనక్కి తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐఎఎస్​ కాడర్​ రూల్స్​లోని సెక్షన్​ 6(1) ప్రకారం.. బందోపాధ్యాయను మే 31లోగా కేంద్రానికి రిపోర్టింగ్​ చేయాలని ఆదేశించడం జరిగింది.  

బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ వ్యవహారిస్తున్న తీరుపై అటు నెటిజన్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీ సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రి మమతతోపాటు ప్రధాన ప్రతిపక్ష నేత సువేందు అధికారిని కూడా ఆహ్వానించడమే మమతాకు ఆగ్రహం తెప్పించి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే అదే బెంగాల్ పక్క రాష్ట్రమైన ఒడిశాలోనూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు, ప్రతిపక్ష నేతను సైతం పీఎం మోదీతో సమీక్ష సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా ఆయా నేతలు తమ రాష్ట్ర అవసరాలను పీఎం మోదీకి వివరించడం జరిగింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు లేని అభ్యంతరం మమతా బెనర్జీ ఎందుకు వ్యక్తం చేసినట్టు? మమత బెంగాల్ కు సీఎం కావడం ఇది మూడోసారే ..!  కానీ అదే నవీన్ పట్నాయ్ ఐదుసార్లు సీఎంగా ఎన్నికైనా జననేత. సైలెంట్ గా ప్రచార మాధ్యమాలకు దూరంగా తన పని తాను చేసుకుపోతుంటారని ఆయనకు పేరుంది. పదే పదే రాజకీయ ఆరోపణలకు ఆయన దూరంగా ఉంటారు. అలాంటాయనే… పీఎం మోదీ సమావేశానికి అధిక ప్రాధాన్యతనిస్తే…! మమతా బెనర్జీ మాత్రం నిర్లక్ష్యం వహించారు. ఆమెకు తన రాష్ట్ర అభివృద్ధి, పునరావాస కార్యక్రమాల కన్నా కూడా రాజకీయాలే ముఖ్యమా? దేశ ప్రజలరా ఆలోచించడండి

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

1 × four =