More

    బాల్య వివాహాల నియంత్రణకు చర్యలు తీసుకోండి: నారాయణస్వామి

    బాల్య వివాహాల నియంత్రణలో సంబంధిత శాఖాధికారులు వైఫల్యం చెందారన్నారు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత సహాయ మంత్రి ఏ.నారాయణస్వామి. వారి కారణంగానే చిన్న వయసులోనే అమ్మాయిలు అనేక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆస్పిరేషన్ జిల్లా అయిన కడప జిల్లాలో తనశాఖ పరిధిలో ప్రగతిపై కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగర పరిధిలో స్వచ్ఛ భారత్ టాయిలెట్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‎ను ఆదేశించారు. ముద్ర లోన్లు, ఇతర కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ క్రింద ఇచ్చే లోన్ల మంజూరులో బ్యాంకర్ల తీరుపై కూడా అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన 50వేల ఇళ్లలో, కేవలం 6వేల 600 మాత్రమే నిర్మాణానికి నోచుకున్నా ఇంకా లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. తనశాఖ పరిధిలోకి వచ్చే అన్ని విషయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

    Trending Stories

    Related Stories