More

    స్వామీజీలు ప్రభుత్వాలను కూల్చేంత సీన్ ఉంటుందా?

    భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే..! ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు తమకు బ్రోకర్ల అవసరం లేదని.. తాము బరిగీసి ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటామని తెలిపారు. తమకు సన్యాసులు, స్వామీజీలతో పనిలేదన్నారు. బ్రోకర్లను పెట్టుకోవాల్సిన ఖర్మ తమకు లేదని.. రోహిత్ రెడ్డి పెద్ద నీతిమంతుడా? అని ప్రశ్నించారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ విడుదల చేసిన వీడియోలో బీజేపీ ప్రస్తావనే లేదన్నారు. రోహిత్ రెడ్డితోనే ప్రభుత్వం కూలిపోతుందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

    టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ కు విశ్వాసం లేదన్నారు. ఏరోజైనా ప్రజాప్రతినిధులను కలిశారా? అని ప్రశ్నించారు. నిన్న చూపించిన వీడియోలో ఏముందో మాకైతే అర్థం కాలేదన్నారు. నెలలో 15 రోజులు ఫాంహౌస్ లో ఉండేవాళ్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? తనకు తెలియకుండా ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటారా? అని నిలదీశారు. తమకు టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని లేదని అన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలన్నది తమ అభిమతమని అన్నారు. తన కొడుకు ముఖ్యమంత్రి కావాలనే కోరికతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. నలుగురు ఆర్టిస్టులు కూర్చుని మీడియా ముందు పెడితే ప్రజలు నమ్మరని ఆయన అన్నారు.

    Trending Stories

    Related Stories