సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు అమిత్ షా. శనివారం రాత్రి 7 గంటల 20 నిమిషాలకు అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా సీఆర్పీఎఫ్ సెక్టార్ మెస్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు కేంద్రహోంమంత్రి అమిత్ షా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. ముందుగా సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు.
ఉదయం 11 గంటలా 10 నిమిషాల వరకు పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవాలు, తర్వాత ఆయన ప్రసంగిస్తారు. వేడుకల అనంతరం 11గంటలా 15 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి సీఆర్‌పీఎఫ్ సెక్టార్ మెస్‌కు చేరుకుంటారు. విమోచన దినోత్సవాల్లో పాల్గొన్న తర్వాత 11:50 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు సీఆర్‌పీఎఫ్ సెక్టార్‌లోనే ఉంటారు. ఈ రెండు గంటల్లో బ్యాడ్మింటన్ పీవీ సింధుతోపాటు మరికొందరితో అమిత్ షా భేటీ అవుతున్నట్లు సమాచారం. సీఆర్ పీఎఫ్ మెస్ నుంచి ఒంటి గంటా 45 నిమిషాలకు షా శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరతారు. 2 గంటలా 25 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు అమిత్‌షా.