More

    తెలంగాణలో అధికారం మాదే: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

    కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పల్స్ తమకు తెలుసని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని అమిత్ షా పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ సౌత్ ఎంట్రీకీ తెలంగాణ గేట్ వే అని అమిత్ షా చెప్పుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీమెజార్టీతో గెలుస్తామని, తెలంగాణలో తప్పనిసరిగా మార్పు వస్తుందని అన్నారు. తానే స్వయంగా తెలంగాణకు వెళ్తానని.. బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు. కింది స్థాయి వరకు ప్రజల నాడి తనకు తెలుసని.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని అన్నారు అమిత్‌ షా.

    Trending Stories

    Related Stories