More

    ఆ ప్రకటనలు ఏంటండీ..!

    సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) తప్పుడు ప్రకటనలతో మోసం చేస్తున్న సంస్థలపై చర్యలకు ఉపేక్షించింది. జీఎస్కే, నాప్టోల్ ప్రకటనలపై సీసీపీఏ సుమోటోగా కేసును స్వీకరించిన సీసీపీఏ.. జనవరి 27న జీఎస్కేకి, ఫిబ్రవరి 2న నాప్టోల్ కు నోటీసులు ఇచ్చినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటన జారీ చేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనలు మరియు అన్యాయమైన వ్యాపార లావాదేవీలకు వ్యతిరేకంగా ఒక ఆర్డర్‌ను ఆమోదించింది. అంతేకాకుండా రూ. 10 లక్షల జరిమానా చెల్లించవలసిందిగా కోరింది. CCPA ఈ విషయాన్ని సుమోటోగా గుర్తించి, గ్లాక్సో స్మిత్‌క్లైన్ (GSK) కన్స్యూమర్ హెల్త్‌కేర్‌కు వ్యతిరేకంగా జనవరి 27న మరియు నాప్టోల్‌కి వ్యతిరేకంగా ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఉత్తర్వులు జారీ చేసిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్డర్ ప్రకారం, CCPA గ్లాక్సో స్మిత్‌క్లైన్ (GSK) కన్స్యూమర్ హెల్త్‌కేర్‌ను ఆర్డర్ జారీ చేసిన ఏడు రోజులలోపు దేశంలో సెన్సోడైన్ కోసం అన్ని ప్రకటనలను నిలిపివేయాలని ఆదేశించింది.

    టూత్ పేస్ట్ ప్రకటనలన్నింటినీ ఆపేయాల్సిందిగా గ్లాక్సోస్మిత్ క్లైన్ కన్జ్యూమర్ హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థను సీసీపీఏ ఆదేశింది. నిబంధనలను ఉల్లంఘించి ప్రకటనలను తీశారని సీసీపీఏ పేర్కొంది. నాప్టోల్ ఆన్ లైన్ షాపింగ్ లిమిటెడ్ సంస్థ ప్రజలు, వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలను ఇస్తున్నారని, అనైతిక వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది. భారత్ వెలుపల ప్రాక్టీస్ చేస్తున్న డెంటిస్టులతో ప్రకటనలు చేయించి భారత్ లో ప్రసారం చేశారని గ్లాక్సో స్మిత్‌క్లైన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అది భారత నిబంధనలకు విరుద్ధమని చెప్పింది. సెన్సోడైన్ ప్రకటనల్లో పేర్కొన్నట్టు ‘ప్రపంచవ్యాప్తంగా డెంటిస్టులు సిఫార్సు చేస్తున్న నెంబర్ వన్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్ సెన్సోడైన్’, ‘60 క్షణాల్లోనే పంటి తీపుల నుంచి ఉపశమనం.. క్లినికల్ గా నిరూపణ’ వంటి కామెంట్లపై విచారణ జరపాల్సిందిగా డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సీసీపీఏ ఆదేశించింది.

    Trending Stories

    Related Stories