National

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఎన్నో పరీక్షలు రద్దయ్యాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరీక్షలను రద్దు చేయడమే మంచిదని భావించారు. దీంతో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు జరపకపోవడమే మంచిదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే ముఖ్యమని.. ఒకవేళ ఎవరైనా పరీక్షలు రాయాలనుకుంటే, వారికి కరోనా తీవ్రత తగ్గాక పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.


ప్ర‌స్తుత క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్య‌మే ముఖ్య‌మ‌ని కేంద్రం ప్రభుత్వం అభిప్రాయపడింది. విద్యార్థుల ఆరోగ్యం, భ‌ద్ర‌త త‌మ‌కు చాలా ప్రాముఖ్య‌మ‌ని ఈ అంశంలో ఎటువంటి రాజీ ఉండ‌ద‌ని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళ‌న నెల‌కొని ఉంద‌ని.. ఎటువంటి ప‌రిస్థితుల్లోనూ విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు బ‌ల‌వంతంగా హాజ‌రుకావొద్ద‌న్నారు. ప్రధాని అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కీల‌క‌ సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్బిఈ) చైర్మన్ మనోజ్ అహుజాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆబ్జెక్టివ్ ప్ర‌మాణాల ప్ర‌కారం ఫ‌లితాలను వెల్ల‌డించాలని సీబీఎస్ఈ భావిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − eleven =

Back to top button