More

  సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేస్కోవచ్చు..!

  ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫలితాలు రానే వచ్చాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాలు వెలువడాయి. తాజాగా ఫలితాలను సీబీఎస్‌ఈ బోర్డు విడుదల చేసింది.

  ఫలితాలను తమ అధికారిక వెబ్‌ సైట్లలో చూసుకోవచ్చని స్పష్టం చేసింది. cbseresults.nic.in, cbse.digitallocker.gov.in, cbse.gov.in ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించింది. రోల్ నెంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నెంబర్ల ఆధారంగా ఫలితాలను చూసుకునే అవకాశం కల్పించారు. ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా 7 వేల 046 సెంటర్లలో పరీక్ష జరిగింది. మొత్తం 21 లక్షల 16 వేల 209 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 8 లక్షల 94 వేల 993 మంది బాలికలు..12 లక్షల 21 వేల 195 మంది బాలురు ఉన్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడులయ్యాయి. రోల్ నెంబర్, పాఠశాల నెంబర్‌ ఆధారంగా ఫలితాలను చూసుకునేలా ఏర్పాట్లు చేశారు.

  cbse.gov.in, results.cbse.nic.in వెబ్‌సైట్లలో స్కోర్ కార్డులను చూసుకోవచ్చు. ఈఫలితాల్లో మొత్తం 92.71 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. టర్మ్ 1,2 పరీక్షల మార్కుల వెయిటేజీ ఆధారంగా సీబీఎస్‌ఈ తుది ఫలితాలను తయారు చేశారు. విద్యా సంవత్సరంలో ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు, ప్రాజెక్ట్ వర్క్‌లు, ప్రాక్టికల్‌ పరీక్షలు, ప్రీ-బోర్డు ఎగ్జామ్స్ ఆధారంగా మార్కులను రూపొందించారు. ఏప్రిల్ 26 నుంచి జూన్ 4 వరకు సీబీఎస్‌ఈ టర్మ్ 2 పరీక్షలు జరిగాయి. మొత్తంగా సీబీఎస్‌ఈ 10, 12 ఫలితాలు ఒకే రోజు విడుదలయ్యాయి.

  spot_img

  Trending Stories

  Related Stories