జమ్మూ, ఢిల్లీ సహా 40 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు..!

ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ సహా 40 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు శనివారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ తో పాటూ 40 చోట్ల సీబీఐ శనివారం దాడులు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసిన ఐఏఎస్ అధికారి షహీద్ ఇఖ్బాల్ చౌధురి తో పాటు పలువురు అధికారులకు చెందిన ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేస్తూ ఉంది. కథువా, రియాసి, రాజౌరి, ఉధంపూర్ జిల్లాల డిప్యూటీ కమిషనర్‌గా చౌదరి పనిచేశారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నకిలీ పేర్లలో వేలాది తుపాకీ లైసెన్సులు జారీ చేసినట్లు షహీద్ ఇఖ్బాల్ చౌధురిపై ఆరోపణలు ఉన్నాయి. షహీద్ ఇఖ్బాల్ చౌధురి 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం గిరిజన వ్యవహారాల విభాగం అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ పదవిలో ఉన్నారు.తుపాకీ లైసెన్స్‌ల కుంభకోణం కేసుకు సంబంధించి ఎనిమిది మంది మాజీ డిప్యూటీ కమిషనర్లను కూడా సీబీఐ విచారిస్తోంది. జమ్ముకశ్మీర్ ఐఏఎస్ అధికారి షాహిద్ ఇక్బాల్ చౌదరి నివాసం సహా 40 ప్రాంతాల్లో సీబీఐ శనివారం ఉదయం దాడులు చేసింది. రాజస్థాన్ ఏటీఎస్ ఈ కుంభకోణాన్ని 2017 లో బయటకు తీసి 50 మందికి పైగా నిందితులను అరెస్టు చేసింది.
కథువా, రేశాయ్, రాజోరీ ప్రాంతాల్లో డిప్యూటీ కమిషనరుగా పనిచేసినన షహీద్ ఇక్బాల్ నకిలీ పేర్లతో ఇతర రాష్ట్రాలు, పలువురు వ్యక్తులకు లైసెన్సులు జారీ చేశారు. 2012 నుంచి ఇప్పటి వరకూ జమ్మూ కశ్మీర్ కేంద్రంగా రెండు లక్షల నకిలీ తుపాకీ లైసెన్సులు జారీ అయ్యాయని సీబీఐ అధికారులు తెలిపారు. గతేడాది ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ సహా ఇద్దరు అధికారులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. కుప్వారా డిప్యూటీ కమిషనర్లుగా పనిచేసినప్పుడు రాజీవ్ రంజన్, ఇత్రాత్ హుస్సేన్ రఫిక్‌లు అక్రమంగా లైసెన్సులను జారీచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్ధిక లావాదేవీలలో అతడి పాత్ర ఉన్నట్టు గుర్తించారు. తొలిసారిగా 2017లో ఈ కుంభకోణం రాజస్థాన్ ఏటీఎస్ బయటకు తీసుకొని వచ్చింది. రంజన్ సోదరుడు, ఇతరులు ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా ఉన్నారు. విజిలెన్స్ ముసుగులో నిందితులకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రక్షిస్తోందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కేసును సీబీఐకి గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా అప్పగించారు.
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఈ విధంగా ఎప్పుడు సిబిఐ దాడులతో బంధిస్తారు.
ఎందుకంటే అతను వెలగబెట్టిన ఘనకార్యాలు ఆ విధంగా ఉన్నాయి. విద్యా వ్యవస్థను మొత్తంగా క్రిస్టియన్ కరణం చేసి, హిందూ దేవుళ్ళ మీద ఒక తరానికి సరిపడా శత్రువులను అనవసరంగా సృష్టించినవాడు