More

    వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీకి సీబీఐ నోటీసులు.. కానీ..!

    వైసీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ తాజాగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అవినాశ్ రెడ్డి మంగళవారం హైదరాబాదులోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరవ్వాలని సీబీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు సీబీఐ అధికారులు పులివెందులలో అవినాశ్ రెడ్డి పీఏకు నోటీసులు అందజేశారు. నోటీసులపై అవినాశ్ రెడ్డి వెంటనే స్పందించారు. సీబీఐ విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని వెల్లడించారు. పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉన్నందున ఈ రోజు విచారణకు రాలేనని తెలియజేశారు. విచారణకు మరో తేదీ తెలియజేయాలని కోరారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

    పులివెందులలో సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం ఆరా తీశారు. సీబీఐ అధికారులు కడప జిల్లా పులివెందులకు వచ్చి వైసీపీ కార్యాలయానికి వెళ్లారు. సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారు. ఆయన కార్యాలయానికి రాలేదని సిబ్బంది చెప్పడంతో సీబీఐ అధికారులు వెనుదిరిగారు. భాస్కర్ రెడ్డి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి. గతంలో, వివేకా కుమార్తె సునీతారెడ్డి పేర్కొన్న 15 మంది అనుమానితుల్లో భాస్కర్ రెడ్డి పేరు కూడా ఉందని పలు కథనాలు వచ్చాయి. భాస్కర్ రెడ్డి ఇప్పటికే ఓసారి సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు.

    Trending Stories

    Related Stories