రంజాన్ రోజు జాతీయ జెండాను టేబుల్ క్లాత్ లా ఉపయోగించిన కుటుంబం

0
830

జాతీయ జెండాకు ఎంతో గౌరవం ఇస్తూ ఉంటాం.. కానీ అస్సాంకు చెందిన ఆ కుటుంబం మాత్రం జాతీయ జెండాను ఏకంగా టేబుల్ క్లాత్ లా ఉపయోగించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. వారికి ఎలాంటి శిక్ష విధించినా తప్పు లేదని సాటి భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

అస్సాం రాష్ట్రంలోని తెంగ్నమారి గ్రామానికి చెందిన రెజీనా పర్వీన్ సుల్తానా తన కుటుంబ సభ్యులకు రంజాన్ సమయంలో భోజనాలను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో టేబుల్ క్లాత్ గా త్రివర్ణ పతాకాన్ని ఉపయోగించారు. ఫోటోను చూడగా ఈ ఘటన వారి ఇంట్లోనే చోటు చేసుకుందని స్పష్టంగా అర్థమవుతోంది. టేబుల్ మీద భారత జాతీయ పతాకం ఉండగా.. దానిపై విందు భోజనానికి సంబంధించిన పదార్థాలు, ప్లేట్లు, బాటిళ్లు కనిపించాయి. కుటుంబ సభ్యులంతా నవ్వుతూ తింటూ ఉన్నారు.

ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడమే కాకుండా పలువురు అస్సాం పోలీసులను ట్యాగ్ చేసి.. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. త్రివర్ణ పతాకాన్ని అవమానించిన వారిని వెంటనే అరెస్టు చేయాలనే డిమాండ్ వినిపించింది. అస్సాం పోలీసులు ఈ ఘటనపై చర్యలు తీసుకున్నారు. బోన్గైగోవాన్ పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 14-05-2021న రంజాన్ సందర్భంగా రెజీనా పర్వీన్ సుల్తానా భోజనాలను ఏర్పాటు చేసిందని.. టేబుల్ క్లాత్ లా భారత జాతీయ పతాకాన్ని ఉపయోగించినట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. రెజీనా పర్వీన్ సుల్తానాతో పాటూ మరో 5 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here