ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. కన్నౌజ్ జిల్లాలోని చిబ్రామౌలో ఉన్న హిందూ ఆలయంపై దిల్షాద్ అనే వ్యక్తి తన సహచరుడితో పాటు దాడి చేశాడు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. అతని సహచరులు పారిపోగలిగినా.. భక్తులు, ఆలయ పూజారి కలిసి ఉమర్ ఫారూక్ అనే మరో వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ప్రజలు మరో నిందితుడు ఉమర్ అలియాస్ బంటిని కూడా పట్టుకున్నారు.
బర్తియా మొహల్లా నివాసి అయిన ఉమర్ తో పాటూ ఇంకొంత మంది కలిసి ఆలయంపై దాడి చేయాలని కొందరు పంపినట్లు విచారణలో చెప్పారు. కాని అతడి పేరును వెల్లడించడానికి నిరాకరించారు. ఆలయంపై దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు భక్తులు విజయనాథ్ ఆలయాన్ని వీరు సందర్శించారు. దిల్షాద్ ఇంకొంత మంది కలిసి కొన్ని నినాదాలు చేస్తూ హిందూ విగ్రహాలను అపవిత్రం చేశారు. భక్తులు ఆలయానికి చేరుకోవడాన్ని చూసి మిగిలిన వాళ్లు పారిపోగా.. దిల్షాద్ ను ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఆలయంపై దాడి జరిగిందన్న విషయం తెలుసుకుని.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయం దగ్గరకు వచ్చారు. దేవాలయం చుట్టూ పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడారు. ఈ ఆలయంలో శివుడు, హనుమంతుడు, దేవి విగ్రహాలు ఉన్నాయి. ఈ ఘటనకు బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందువులు ఆలయం చుట్టూ నిరసనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.
ఈ ఘటన చోటు చేసుకున్నాక ఆలయ పూజారి రామ్‌కిషోర్ మిశ్రా.. దిల్షాద్ మరికొందరు వ్యక్తులను ఆపడానికి ప్రయత్నించాడు. పూజారిపై ఘర్షణకు దిగి తప్పించుకోవాలని ప్రయత్నించారు. ప్రధాన నిందితులను, మిగిలిన వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరిపై ఎన్‌ఎస్‌ఏ కింద కేసు నమోదు చేయనున్నట్లు కన్నౌజ్ పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. ఈ కేసులో మిగిలిన నిందితులను పోలీసులు వెతుకుతున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.