సనాతనం.. నా జీవనవేదం..!

0
165

సనాతన ధర్మంలో కుల వివక్ష ఎక్కడా లేదు.. దాన్ని కేవలం స్వార్థపరులు సృష్టించారు. అందరూ సమానులే అని యజుర్వేదం చెబుతుంది. అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వసుదైక కుటుంబం అనేది ఎప్పటి నుండో వస్తూ ఉంది. మనుషులు, జంతువులు, పక్షులు, వృక్షాలతో సహా అన్ని జీవులు రుద్రుని స్వరూపమని అద్వైతం చెబుతుతోంది. వేదాలు చూసుకున్నా.. భగవద్గీతను పరిశీలించినా.. ఎందులోనూ కులం, జాతి లాంటివి లేవు. ‘దళిత్’ అనే పదం కూడా అందులో లేదు. కేవలం నాలుగు వర్ణాలు మాత్రమే ఉన్నాయి. గుణం, చేసే పనుల ద్వారా మాత్రమే ఈ వర్ణాలను విభజించారు. కుల వివక్షను సృష్టించింది మానవులే..! వేదాలు, భగవద్గీతలో ఈ విషయాల గురించి చెప్పలేదని దయచేసి అర్థం చేసుకోండి. ధనికులు పేదలను దోచుకోవడం, చదువుకున్నవారు చదువు లేనివాళ్లను చులకన చేయడం, డాక్టర్లు రోగులను దోపిడీ చేయడం లాంటిది ప్రపంచం మొత్తంలో ఉంది. ఏ మతమూ ఈ విషయం గురించి చెప్పలేదు. భారతదేశంలోని కుల వివక్ష గురించి సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. పాశ్చాత్య దేశాలలో జాత్యహంకారం అనేది మనుషుల మధ్య సమస్య, మతపరమైన సమస్య కాదు. ఇతర మతాలలో ఉన్న కులవివక్ష, స్త్రీ వివక్ష గురించి మాట్లాడగలరా..? తండ్రి జాతి కుమారునికి రావడం అన్నది ముస్లింలు, క్రైస్తవులలో కూడా ఉంది. డీఎంకేలో తండ్రి తర్వాత కొడుకు మాత్రమే ఎందుకు సీఎం అయ్యాడు..? సీఎం పదవిని కూడా పుట్టుకతో నిర్ణయించింది మీరు కాదా..?

  • సనత్ కుమార్, సీనియర్ మేనేజర్ (రి.), కరూర్ వైశ్యా బ్యాంక్, చెన్నై