రెచ్చగొట్టే ప్రసంగాల ఎఫెక్ట్.. అసదుద్దీన్ ఒవైసీపై కేసు..!

0
1048

MIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఒవైసీపై కేసు నమోదైంది. నుపుర్ శర్మ వ్యాఖ్యల వ్యవహారంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ.. ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేశారు.

మరోవైపు.. యతి నరసింహానంద్ పై కూడా కేసు నమోదైంది. ఇఫ్సో.. అంటే.. ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు పోలీసులు.

నుపుర్ శర్మ వ్యవహారంపై సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టడం, ప్రేరేపించే వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని.. వారిపై ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా.. నుపుర్ శర్మతో పాటు సోషల్ మీడియా కు చెందిన పలువురు ప్రముఖులపై ఐపీసీ 153, 295, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి నిందితులందరికీ నోటీసులు పంపుతామన్నారు పోలీసులు.

సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిపై గతంలో ఇఫ్సో వివిధ సెక్షన్ల కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కంప్లైంట్స్ అందిన తర్వాత ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేశారు. వీరిలో నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌తో పాటు షాదాబ్ చౌహాన్, సబా నఖ్వీ, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా, పూజా షకున్‌ల పేర్లు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో ఒవైసీ, స్వామి యతి నరసింహానందతో సహా మరో 11 మంది పేర్లను చేర్చారు.

సామాజిక మాద్యమాలను విశ్లేషించన తర్వాతే.. శాంతికి విఘాతం కలిగించే పోస్టులు, ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టే వారిపై తాము ఈ చర్యలు తీసుకున్నామంటున్నారు పోలీసులు. మరోవైపు.. ఢిల్లీ పోలీసులు అసదుద్దిన్ పై కేసు నమోదుచేశారని తెలియగానే.. ఆయన మద్దతుదారులు పార్లమెంటు స్ట్రీట్‌లో నిరసనకు దిగారు. నుపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారు.

దేశంలోని ముస్లింల మీద ప్రేమతో కాకుండా.. ఇస్లామిక్ దేశాల ఒత్తిడితోనే.. పది రోజుల తర్వాత.. ఆమెను పార్టీ నుంచి బీజేపీ తప్పించిందని.. నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పినా.. అది క్షమాపణ కాదంటూ.. ఒవైసీ తన వర్గానికి చెందిన ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు వినిపిన్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

2 + 11 =