More

  పాక్ నుండి హ్యాండ్ గ్రెనేడ్లు.. హైదరాబాద్ లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై వేయడానికి ప్లాన్

  హైదరాబాద్ లో పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలపై దాడులతో పాటు.. పలు ప్రాంతాల్లో పేలుళ్లకు జాహిద్ కుట్ర పన్నాడని అధికారులు గుర్తించారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం యువకులను జాహిద్ (39) రిక్రూట్ చేసుకున్నాడని.. ఇప్పటికే ఆరుగురు యువకులను అతడు తీవ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేశాడని తెలుస్తోంది. ముసారాంబాగ్ లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జాహిద్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. టెర్రర్ గ్రూపులతో జాహిద్‌కు లింకులు ఉన్నట్టు గుర్తించారు. గతంలో మక్కామసీదు పేలుళ్ల కేసులో జాహిద్‌ను పోలీసులు ప్రశ్నించారు.

  ఉగ్రవాద సంస్థలతో సంబంధాల విషయంలో శనివారం రాత్రి నుండి హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి కనీసం నలుగురిని పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మూసారాంబాగ్‌కు చెందిన జాహిద్ కూడా ఉన్నాడు, ఇతను గతంలో బేగంపేట టాస్క్‌ఫోర్స్ ఆఫీసు పేలుడులో నిర్దోషిగా విడుదలయ్యాడు. జాహిద్ సోదరుడు షాహిద్ బిలాల్ కు కూడా ఉగ్రవాద కేసుల్లో ప్రమేయం ఉందని తెలుస్తోంది. అతడు పాకిస్థాన్‌లో కాల్చి చంపబడ్డాడు. హైదరాబాద్ పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు, సాయుధ రిజర్వ్ ప్లాటూన్ల బృందాలు కలిసి వివిధ ప్రాంతాల్లో దాడుల్లో పాల్గొన్నాయి. కొంతమంది నాయకులపై దాడికి కుట్ర పన్నినందుకు జాహిద్ పై కేసు నమోదు చేయబడింది. పోలీసులు అతన్ని పట్టుకున్నారు.

  గతంలో హైదరాబాద్‌లో పలు ఉగ్రదాడి కేసుల్లో నిందితుడైన మలక్‌పేటకు చెందిన జాహిద్ పాకిస్థాన్ హ్యాండ్లర్ల సూచన మేరకు మాజ్, సముల్లా, ఆదిల్ అఫ్రోజ్, అబ్దుల్ హై, సోహైల్ ఖురేషీ, అబ్దుల్ కలీమ్ అలియాస్ హడ్డీతో పాటు పలువురు యువకులను రిక్రూట్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. LeT/ISIకి పని చేయాలని జాహిద్ యువకులకు సూచించాడు. పాక్ హ్యాండ్లర్ల సూచనల మేరకు హైదరాబాద్‌లో పేలుళ్లకు పాల్పడి భయాందోళనలు సృష్టించేందుకు తన ముఠా సభ్యులతో కలిసి కుట్ర పన్నాడు. జాహిద్ పాకిస్తాన్ నుండి హ్యాండ్ గ్రెనేడ్‌లను అందుకున్నాడని.. వాటిని RSS లేదా BJP సమావేశాలలో ఉపయోగించాలని భావిస్తున్నట్లు FIR పేర్కొంది. ఉగ్రవాద సంస్థల నుండి డబ్బు అందుకున్నట్లు తెలిసిందని అధికారులు తెలిపారు.

  Trending Stories

  Related Stories