పోసాని కృష్ణమురళిపై రాజమండ్రిలో కేసు నమోదు

0
726

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై రాజమండ్రిలో కేసు నమోదైంది. పోసాని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను, జనసేన నేతలను, వీర మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు పోసానిపై 354, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

పోసాని కృష్ణమురళికి ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్ డీసీ) చైర్మన్ పదవి ఇచ్చింది. ఇటీవల పోసాని పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు జనసేన నేతలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పోసానిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది.