More

  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేంద్రానికి కంప్లైంట్.. పక్కా సమాచారంతో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం

  ఐపీఎస్ అధికారి, గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం LRPF ఫిర్యాదు చేసింది. ఓ కార్యక్రమానికి హాజరైన ప్రవీణ్ హిందూ దేవీదేవతలను నమ్మను, ప్రార్థించను అంటూ ప్రతిజ్ఞ చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పలువురు ఆయనపై ఫిర్యాదు చేశారు.

  ఐపీఎస్ అధికారి, గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం LRPF ఫిర్యాదు చేసింది. ఓ కార్యక్రమానికి హాజరైన ప్రవీణ్ హిందూ దేవీదేవతలను నమ్మను, ప్రార్థించను అంటూ ప్రతిజ్ఞ చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పలువురు ఆయనపై ఫిర్యాదు చేశారు.

  వీడియోలో ప్రవీణ్ కుమార్ సహా వందలాది మంది హిందూసంప్రదాయాలు, హిందువుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ప్రతిజ్ఞ తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం… డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కు ఫిర్యాదు చేసింది. ఆధారంగా వీడియో జతచేస్తూ ప్రవీణ్ కుమార్ పైనా, ఆయన నిర్వహిస్తున్న సంస్థ స్వేరోస్ పైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరింది.

  ”ఒక ఐపీఎస్ అయి ఉండి… హిందూ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించడం ద్వారా… తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల మెదళ్లలో విషబీజాలు నాటుతూ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రవీణ్ కుమార్ పాల్పడుతున్నారు. దాన్నే మీదృష్టికి తీసుకువస్తున్నాం అంటూ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ ను ప్రవీణ్ పూర్తిగా అధిగమించినట్టు ఫోరం ఆధారాలతో సహా కంప్లైంట్ చేసింది.

  నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ పాఠశాలలు, కళాశాలల నిర్వహణకు 2014లో సర్కారు  Telangana Social Welfare Residential Educational Institutions Society ను ఏర్పాటు చేసింది. దానికి కార్యదర్శిగా ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నియమించింది. అదే సమయంలో స్వేరోస్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు ప్రవీణ్. పేద ఎస్సీల అభ్యున్నతి పేరిట చిన్నారుల్లో విషబీజాలు నాటడమే లక్ష్యంగా ఆయన, ఆయన సంస్థ్ స్వారోస్ పనిచేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఓ ఐపీఎస్ అయి ఉండి రాష్ట్రంలో గురుకులాలను ఆధీనంలోకి తీసుకుని సమాంతర వ్యవస్థను నడిపిస్తున్నారని చాలాకాలంగా ఆయనపై విమర్శలు వచ్చాయి.

  సంక్షేమం పేరిట సంఘ విద్రోహ కార్యకలాపాలు గతంలో వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం, సీఎం అండ ఉండడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారని అంటారు. అసలు ఐఏఎస్ అధికారులకు అప్పగించాల్సిన బాధ్యతను ఐపీఎస్ కు ఇవ్వడం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలూ ఉన్నాయి. అదే సమయంలో ఆయన సంస్థ స్వేరోస్ దేశమంతటా విస్తరించి కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలుస్తోంది. అంతేకాదు సంక్షేమ హాస్టళ్లలో ఇంకా అనేకానేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని… ఆడపిల్లల్ని వేధిస్తున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.

  ఇక తాజాగా కలకలం రేపిన ఈ వీడియో మార్చి 15నాటిది. “స్వెరోస్ పవిత్ర మాసం” సందర్భంగా పెద్దపల్లి జిల్లా, వడుకదూర్ మండలం ధూళికట్టలో భీమ్ దీక్ష నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారు చేసిన ప్రతిజ్ఞలో పూర్తిగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉంది.

  “నాకు రాముడి మీద, కృష్ణుడిమీద, గౌరి మీద గణపతి మీద నమ్మకం లేదు. నేను వాళ్లను పూజించను.. భగవంతుని అవతారాలు అనే భావననే నేను అంగీకరించను. నేను శ్రాద్ధకర్మలు చేయను, పిండ ప్రదానం చేయను ‘ అంటూ ప్రతిజ్ఞఉంటుంది.

  ఈ వీడియో వైరల్ అయ్యాక చోటు చేసుకున్న పరిణామాల గురించి మనకు విధితమే. అయితే ఇప్పటికైనా హిందువులు మేలుకోవాలంటూ పలు హిందూ సంఘాలు పిలుపునిస్తున్నాయి. లేదంటే తీవ్రమైన గడ్డుపరిస్థితులను ఎదొర్కొనవలసి వస్తుందని హెచ్చరించాయి. మన మధ్యనే ఉంటూ చిన్న పిల్లల్లో సైతం విషభీజాలు నాటే వ్యక్తుల పట్ల ప్రభుత్వాలు ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదంటూ హిందువులు ప్రశ్నిస్తున్నారు. వేరే ఏ ఓటు బ్యాంకు మతానికైనా ఇటువంటి సందర్భమే ఎదురైయ్యుంటే ఇలానే వ్యవహరించేవారా అని నినదిస్తున్నారు.

  ఇక గతంలో ఎందరో దేశ విచ్ఛిన్నకర శక్తులకు చుక్కలు చూపించిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తాజాగా ఈ ఇష్యూను కూడా చాలా ప్రస్టేజియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగా ఘటనను కేంద్రం వద్దకు తీసుకువెళ్లింది. ఇక దీనిపై ప్రభుత్వ యంత్రాంగాలు ఎంతవరకు న్యాయం చేస్తాయన్నది వేచి చూడాలి.

  Trending Stories

  Related Stories