అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక సమీపంలో ఓ కారు నేల బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆదర్శ పాడి రైతు పెన్నమ్మరాజు సుబ్బరాజు వర్మ మృతి చెందాడు. ఎలమంచలి నుంచి ఏటికొప్పాకకు వస్తున్న కారు ప్రమాదవశాత్తు బావిలో పడింది. సుబ్బరాజు ఇంటికి రాకపోవడంతో అనుమానించిన కుటుంబసభ్యులు ఆయన కోసం గాలించారు. రోడ్డు పక్కన ఉన్న నేలబావి వద్ద కారు టైరు గుర్తులు కనిపించటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది సహకారంతో పోలీసులు కారును బయటకు తీశారు.