ఆ రెండు ట్రస్టులకు ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ రద్దు

0
887

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలోని రెండు ట్రస్టులకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ రద్దు చేసింది. ఎఫ్.సీ.ఆర్.ఏ. అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్.. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు విదేశాల నుంచి విరాళాలు స్వీకరించాలంటే ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ తప్పనిసరి. సోనియా నేతృత్వంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు ఆర్థికపరమైన నిబంధనలు ఉల్లంఘించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. దీంతో ఈ రెండు సంస్థలపై ఎఫ్.సీ.ఆర్.ఏ. ప్రకారం చర్యలు తీసుకున్నామని, ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేశామని కేంద్ర హోంశాఖ అధికారులు వెల్లడించారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు పత్రాల్లో అవకతవకలు, విదేశీ నిధుల దుర్వినియోగం, అక్రమ నగదు చెలామణీ తదితర అక్రమాలను గుర్తించామని.. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు నిధులు అందించిన వారి జాబితాలో చైనా కూడా ఉందని అధికారులు తెలిపారు.