శ్రీ భగవద్గీతా పార్క్.. భారతదేశంలో కాదు కెనడాలో..!

0
850

కెనడాలోని బ్రాంప్టన్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ నగరంలోని 6వ వార్డులో ఒక పార్కుకు “శ్రీ భగవద్గీతా పార్క్” అని పేరు పెట్టింది. ఈ పార్క్ 3.75 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పార్క్ ఎంతో అందంగా, సుందరంగా ఉంటుంది. హిందూ దేవతలతో పాటు గీతలోని రెండు ప్రధాన పాత్రలు, రథంపై శ్రీకృష్ణుడు, అర్జునుడి శిల్పాలు ఉంటాయని ప్రెస్ నోట్ లో తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ మాట్లాడుతూ.. “నేను గీతా బోధనలను విశ్వసిస్తాను.. గౌరవిస్తానని తెలిపారు. బహుశా భారతదేశం వెలుపల పవిత్ర గ్రంథమైన “శ్రీ భగవద్గీత” పేరు పెట్టబడిన ఏకైక పార్కు ఇదేనని ఆయన అన్నారు. మెట్రోపాలిటన్ ప్రాంత ప్రజలు అనుసరించే అన్ని మతాలను గౌరవిస్తామని ఆయన అన్నారు.

కెనడాలోని సిక్కుల తర్వాత హిందువులు రెండో స్థానంలో ఉన్నారు. అక్కడ ఎక్కువగా గుజరాతీలు ఉన్నారు. సిటీ కౌన్సిల్ ప్రకారం, పార్క్‌లో ‘గర్బా’ వేడుకల కోసం కొంత ప్రాంతం, బాస్కెట్‌బాల్ కోర్ట్, క్రికెట్ మైదానం, యోగా చేయడానికి స్థలం ఉంటుంది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. పవిత్ర భగవద్గీతలో బోధించిన సందేశాన్ని మరింత వ్యాప్తి చేయడంలో ఈ పార్క్ ప్రతీకగా మారుతుందని ఆయన అన్నారు.