National

మమతాకు మరో షాక్ ఇచ్చిన కలకత్తా హై కోర్టు

మమతా బెనర్జీ ప్రభుత్వానికి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పోల్ అనంతర హింసపై దర్యాప్తు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) కు ఆదేశించిన ఉత్తర్వుపై మమతా బెనర్జీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ చేసిన అభ్యర్థనను కలకత్తా హైకోర్టు తిరస్కరించింది. పోల్ అనంతర హింస సమయంలో మానవ హక్కుల ఉల్లంఘన కేసులను పరిశీలించడానికి ప్యానెల్ ఏర్పాటు చేయాలని జూన్ 18 న కోర్టు ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్‌పర్సన్‌కు ఆదేశించింది.

ఎన్నికల తర్వాత హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తుకు సిద్ధమైంది. దీన్ని సవాల్‌ చేస్తూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన మమతా సర్కారుకు చుక్కెదురైంది. ఈ పిటిషన్‌ను విచారించిన ఐదుగురు సభ్యుల హైకోర్టు ధర్మాసనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అభ్యర్దనను తోసిపుచ్చింది. జూన్‌ 18న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సంతృప్తి పర్చడంలో బెంగాల్‌ సర్కార్‌ విఫలమైనందున ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణకు ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల హింసను అరికట్టడంలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని కోర్టుకు వివరించేందుకు తగినంత సమయం ఇవ్వలేదని మరో వైపు మమతా బెనర్జీ సర్కారు చెప్పినప్పటికీ హైకోర్టు ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏడుగురు సభ్యుల ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం బెంగాల్లో ఎన్నికల అనంతర హింసపై విచారణ జరపబోతోంది.

ఫిర్యాదులను దర్యాప్తు చేయడానికి.. తిరిగి కోర్టుకు నివేదించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసిన ఉత్తర్వులను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. నేరస్థులపై వచ్చిన ఫిర్యాదులపై చర్య తీసుకోని అధికారుల వివరాలను చేర్చాలని కోర్టు ఎన్‌హెచ్‌ఆర్‌సిని కోరింది. పశ్చిమ బెంగాల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జూన్ 10 న హైకోర్టుకు ఇచ్చిన 3,423 ఫిర్యాదులపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని హోంశాఖ కార్యదర్శి బిపి గోపాలిక పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు:

పోల్ అనంతర హింస సమయంలో రెండు డజన్లకు పైగా బీజేపీ కార్యకర్తలు చంపబడ్డారు. గ్రూప్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ అండ్ అకాడెమిషియన్స్ (జిఐఎ) సమర్పించిన నివేదికలో ఎన్నికలలో విజయం సాధించిన తరువాత టిఎంసి కార్యకర్తలు బీజేపీ నాయకులపై కోపాన్ని చూపించారు. బీజేపీకి ఓటు వేసిన హిందువులపై దాడులు చేశారు. “బాధితులు ప్రధానంగా హిందూ సమాజంలోని చాలా తక్కువ వర్గాలకు చెందినవారని.. వారు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేశారు. రాజకీయ ప్రత్యర్థులు వారిని టార్గెట్ చేసి దాడులు చేశారని” నివేదికలో ఉంది. ఎంతో మంది ఆడవారిపై లైంగిక దాడి కూడా జరిగింది. కొందరు పోలీసు అధికారులు తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా మారిపోయారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 + three =

Back to top button