More

    ఐకానిక్ బ్రిడ్జిలు కాదు.. ప్రాజెక్ట్‎లు, రిజర్వాయర్లు కావాలి: బైరెడ్డి

    రాయలసీమ, దక్షిణ తెలంగాణ చాలా కరువు ప్రాంతాలన్నారు మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్‎రెడ్డి. సాగు, తాగు నీటికి ఎల్లప్పుడూ ఈ రెండు ప్రాంతాలకు ఇబ్బందులు ఉంటాయన్నారు. కృష్ణా పెన్నూరు దగ్గర ఐకానిక్ బ్రిడ్జి చేస్తామని నిన్న గడ్కరీ ట్వీట్ చేశారని.. 11వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న ఈ బ్రిడ్జిపై ఎవరో తప్పుడు సలహా ఇచ్చారన్నారు బైరెడ్డి. ఐకానిక్ బ్రిడ్జి వల్ల ఎవరికి మేలు జరగడం లేదన్నారు. అసలు దీని వల్ల రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. రాయలసీమకు కావాల్సింది ఐకానిక్ బ్రిడ్జిలు కాదని… ప్రాజెక్ట్‎లు, రిజర్వాయర్లు అని బైరెడ్డి స్పష్టం చేశారు.

    Trending Stories

    Related Stories