More

    హైదరాబాద్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్.. దుంగలను ఎక్కడ దాచారంటే

    ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఎల్బీనగర్ పరిధిలో శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఆ సమయంలో అరటిపండ్ల లోడుతో వస్తోన్న వాహనాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీలు చేశారు. వాహనంలో ఉన్న అరటిగెలలను తీసి చూడగా.. కింద ఎర్రచందనం దుంగలు కనిపించాయి. ఇద్దరు నిందితులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎర్రచందనం దుంగలను ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 31 ఎర్రచందనం దుంగలు, మూడు మొబైల్ ఫోన్లు, రూ.1600 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగల విలువ రూ.60 లక్షలపైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

    ఎల్‌బీ నగర్‌ జోన్‌లోని స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ), మల్కాజ్‌గిరి పోలీసులతో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. పట్టుకున్న వ్యక్తులను కడప జిల్లా ముద్దనూరుకు చెందిన షేక్ మొహమ్మద్ రఫీగా, నెరేడ్ మెట్ కు చెందిన ముల్లా బషీర్ అహ్మద్, కడప జిల్లా బ్రహ్మంగారి మఠంకు చెందిన మూర్తీగా గుర్తించారు. మొత్తం 31 దుంగలు, మూడు మొబైల్ ఫోన్స్, 1600 రూపాయల క్యాష్ ను నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు రఫీ యూపీ, తెలంగాణ, రాజస్థాన్.. మొదలైన రాష్ట్రాలలో అరటికాయల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. మరో నిందితుడు ముల్లా బషీర్ అహ్మద్ కూడా అరటిపండ్ల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అరటి పళ్ల వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవడంతో అప్పులు తీర్చేందుకు తెలంగాణలో ఎర్రచందనం కొనుగోలు చేసి విక్రయించాలని పథకం పన్నారని, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బ్రహ్మంగారిమఠం లింగాలదిన్నెపల్లికి చెందిన మూర్తితో పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.లక్ష నగదు తీసుకుని సుమారు 1500 కిలోల బరువున్న ఎర్రచందనం దుంగలను సరఫరా చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చి మల్కాజిగిరిలోని మౌలా-అలీ దర్గాలోని ప్రభుత్వ భూమి సమీపంలో ఉంచారు. 12.05.2022 సాయంత్రం మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలా-అలీ దర్గా సమీపంలోని అక్రమ ఎర్రచందనం కలప డంప్‌పై మల్కాజిగిరి పోలీసుల సహకారంతో దాడులు నిర్వహించి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 1500 కిలోల బరువున్న 31 ఎర్రచందనం దుంగలు, మూడు మొబైల్ ఫోన్లు, రూ.1600/- నగదు స్వాధీనం చేసుకున్నారు.

    Trending Stories

    Related Stories