More

  కన్హయ్యను హత్య చేసిన ప్రాంతంలో 90 శాతం తగ్గిపోయిన వ్యాపారాలు

  రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు కన్హయ్య లాల్ అనే హిందూ టైలర్‌ను ఇద్దరు ముస్లిం వ్యక్తులు హత్య చేసిన దాదాపు నెల తర్వాత అక్కడి పరిస్థితుల్లో మునుపటి మార్పు రాలేదు. జూన్ 28 న సంఘటన జరిగిన ప్రాంతంలో వ్యాపారం 90 శాతం తగ్గిందని అనేక నివేదికలు వెలువడ్డాయి. ఉదయపూర్‌లోని రద్దీ మార్కెట్‌లలో ఒకటిగా పేరుగాంచిన మలదాస్ వీధి ప్రాంతంలో కన్హయ్య లాల్ హత్యకు గురయ్యాడు. ఉదయపూర్‌లోని మలదాస్ వీధిలో మొత్తం 15 దుకాణాలు ఉన్నాయి, ఇక్కడ జూన్ 28 వరకు వ్యాపారం బాగా సాగింది. హిందూ టైలర్ హత్య తర్వాత.. మొత్తం 15 దుకాణాలలో దాదాపు 13 మూతపడ్డాయి. వ్యాపారులు వీధిలోకి వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు.

  బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వ్యాఖ్యల తర్వాత ఆమెకు మద్దతు ఇచ్చినందుకు కన్హయ్య లాల్‌ను మహమ్మద్ రియాజ్ మరియు మహ్మద్ గౌస్ అనే ఇద్దరు ఇస్లామిక్ రాడికల్స్ చంపారు. కస్టమర్లుగా నటిస్తూ దుకాణంలోకి ప్రవేశించిన ఇస్లాంవాదులు కన్హయ్య లాల్ గొంతు కోసి, దాదాపు 26 సార్లు కత్తితో పొడిచారు. హత్యను వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా కూడా విడుదల చేశారు. వీరిద్దరూ ప్రధాని మోదీని హత్య చేస్తామని బెదిరించారు.

  ‘లేటెస్ట్ టైలర్స్’ షాప్‌ని కలిగి ఉన్న మాలాదాస్ వీధికి చెందిన మహావీర్ అనే టైలర్‌ మీడియాతో మాట్లాడారు. తన దుకాణం మరణించిన కన్హయ్య లాల్ దుకాణానికి సమీపంలో ఉందని.. కన్హయ్య హత్య తర్వాత ప్రజలు ఆ ప్రాంతంలోకి ప్రవేశించడానికి భయపడుతున్నారని అన్నారు. “ఇప్పటికి 20 రోజులకు పైగా అయింది. కానీ ప్రజలు ఇప్పటికీ భయపడుతున్నారు. నా షాపులో ఇద్దరు పని చేస్తున్నారు. వారిలో ఒకరు అనారోగ్యంతో ఉన్నారు. రెండోవ్యక్తి రావాలంటేనే భయపడుతూ ఉన్నాడు. ఇక్కడ పని చేయడం ఇష్టం లేదని తెలియజేశాడు. పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు రావడానికి అతని కుటుంబ సభ్యులు అనుమతించడం లేదు. మా షాపు బయట యూనిఫారంలో నిలబడిన పోలీసును చూసి అందరూ భయపడి, ఆశ్చర్యపోతున్నారు, ”అన్నారాయన.

  ఉదయ్‌పూర్‌లో బంగారు వ్యాపారి అయిన మయాంక్ లోధా అనే మరో వ్యాపారవేత్త మాట్లాడుతూ.. కస్టమర్లు తమ ఇళ్ల నుండి ఇక్కడకు వచ్చే ముందు మార్కెట్ పరిస్థితి గురించి అడగడానికి దుకాణదారులకు ఫోన్ చేస్తారు. మార్కెట్ పరిస్థితి గురించి అడుగుతారు. అంతా మామూలే అని తెలిసిన తర్వాతే ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. కన్హయ్య లాల్ హత్య తర్వాత అనేక మంది వ్యాపారవేత్తలకు కూడా బెదిరింపులు వచ్చాయని, ఇది నగరంలో భయాందోళన స్థాయిని పెంచిందని ఆయన అన్నారు.

  ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని ఎస్పీ వికాస్ శర్మ మీడియాకు తెలిపారు. మాల్డా వీధిలో మోహరించిన పోలీసు సిబ్బంది ప్రతిరోజూ వ్యాపార యజమానులతో మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. “కన్హయ్య లాల్ హత్య తర్వాత ముగ్గురు వ్యాపారులకు హత్య బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులకు పాల్పడిన వారి గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు సైబర్ సెల్ సహాయం కూడా తీసుకుంటున్నారు” అని అన్నారు. ఏ కస్టమర్ లేదా వ్యాపారవేత్త కూడా భయపడాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. దారుణ హత్య జరిగి రోజులు గడుస్తున్నా కూడా కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఉదయపూర్ పౌరులను భయపెడుతూనే ఉంది.

  spot_img

  Trending Stories

  Related Stories