దీపావళికే ఆంక్షలు.. బాణసంచా కాలిస్తే జైలు శిక్ష

0
837

దీపావళి పర్వదినాన బాణసంచాను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నిషేధ ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ పరిధిలో బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా కూడా రూ.200 జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 6 నెలల పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశాలున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో దీపావళి రోజున పటాకులు పేల్చడాన్ని నిషేధించింది. రాజధానిలో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని.. అందుకు తగ్గట్టుగా మీరు ప్రవర్తించకపోతే జైలుకు కూడా పంపుతారు. ఢిల్లీలో పటాకులు కొని, పేల్చితే 200 జరిమానానే కాకుండా.. ఆరు నెలల జైలు శిక్ష తప్పదని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు చేస్తూ పట్టుబడిన వారికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు గోపాల్ రాయ్ ప్రకటించారు. పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 9B కింద వారికి ₹5,000 జరిమానా కూడా విధించబడుతుంది.

“ఢిల్లీలో పటాకులు కొనుగోలు చేసి పేల్చితే భారతీయ శిక్షాస్మృతి (IPC) ప్రకారం ₹200 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుంది. ఢిల్లీలో బాణసంచా తయారీ, నిల్వ చేస్తే రూ. 5,000 వరకు జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది” అని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.

ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో ఈ నిషేధాన్ని అమలు చేయడానికి మొత్తం 408 బృందాలను పంపింది. ఢిల్లీ పోలీసులు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో 210 బృందాలను ఏర్పాటు చేయగా, రెవెన్యూ శాఖ 165 బృందాలను, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ 33 బృందాలను ఏర్పాటు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం దీపావళితో సహా జనవరి 1 వరకు అన్ని రకాల బాణాసంచా ఉత్పత్తి, అమ్మకం, వినియోగంపై పూర్తి నిషేధాన్ని విధించింది.