More

    బురఖాతో వచ్చి సీఆర్ఫీఎఫ్ క్యాంపు పై బాంబు దాడి

    జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై బురఖా ధరించిన ఉగ్రవాది పెట్రోల్ బాంబు విసరడం జరిగింది. బురఖా ధరించిన ఓ ఉగ్రవాది సీఆర్‌పీఎఫ్‌ పోస్ట్‌పై బాంబు విసురుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇస్లామిక్ దుస్తులలో కనిపించిన గుర్తుతెలియని ఉగ్రవాది, వీధి మధ్యలో ఆగి, అతని/ఆమె బ్యాగ్ నుండి బాంబును తీసి CRPF క్యాంపుపై విసరడం చూడవచ్చు. వెంటనే ఘటనా స్థలం నుంచి ఉగ్రవాది పారిపోతూ కనిపించాడు/కనిపించింది. ఉగ్రవాది ఆ శిబిరంపై బాంబులు విసిరినప్పుడు కొన్ని ద్విచక్ర వాహనాలు కూడా అక్కడే ఉన్నాయి. పెట్రోలు బాంబు పేలిన మంటలను అదుపు చేసేందుకు చుట్టుపక్కలవారు నీళ్లు పోశారు.

    పీటీఐ నివేదిక ప్రకారం, బురఖా ధరించిన మహిళ సీఆర్పీఎఫ్ క్యాంపు వద్ద భద్రతా సిబ్బందిపై బాంబు విసిరింది. ఈ దాడిలో ఒక పోలీసు, ఒక సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డారు. వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సీఆర్పీఎఫ్ జవాన్లు ఈ దాడికి పాల్పడిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సోపోర్‌లోని సిఆర్‌పిఎఫ్ బంకర్‌పై బాంబు విసిరిన మహిళను గుర్తించామని, ఆమెను త్వరలో అరెస్టు చేస్తామని ఐజిపి కశ్మీర్ విజయ్ కుమార్ తెలిపారు. గత 10 రోజుల్లో లోయలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై బాంబు విసరడం ఇది రెండో ఘటన. మార్చి 19 న, సీఆర్పీఎఫ్ యొక్క బాబాపోరా శిబిరంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఇందులో ఒక జవాన్ గాయపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

    Trending Stories

    Related Stories