International

అద్భుత ఆవిష్కరణ.. బుల్లెట్ ట్రైన్‎లో చంద్రుపై షికారు..!

శాస్త్రసాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలు పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. విశ్వ రహస్యాలను చేధించేందుకు తహతహలాడుతున్నాయి. భూమి కాకుండా ఇతర ప్రాంతాలను ఆన్వేషించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నో రకాల పరిశోధనలు కూడా జరిగాయి.

ఒకవైపు అమెరికా మళ్లీ చంద్రుడిపైకి వెళ్లే పనిలో పడింది. మరోవైపు అంగారకుడిపై నీటి అన్వేషణలో చైనా నిమగ్నమైంది. అదే సమయంలో చంద్రునిపైకి బుల్లెట్ రైలును నడపడానికి జపాన్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇది ఒక కృత్రిమ అంతరిక్ష నివాసంలా ఉంటుంది. మానవులు మరొక గ్రహానికి వెళ్లాలనే కల నెరవేరనుంది. జపాన్ ఈ భారీ ప్రణాళికను రూపొందించడానికి ప్రకటించింది. భూమి నుంచి చంద్రునిపైకి జపాన్ బుల్లెట్ రైలును నడపనుంది. ఇది విజయవంతమైతే అంగారకుడిపైకి కూడా నడిపే యోచనలో ఉంది. అక్కడ దిగేందుకు, బస చేసేందుకు క్యాప్సూల్‌ నిర్మించేందుకు బ్లూప్రింట్‌ కూడా సిద్దం చేస్తుంది.

ఈ ప్రణాళికతో పాటు, అంతరిక్షంలో ఒక అంతరిక్ష కేంద్రం, నివాసం నిర్మించనుంది, ఇక్కడ మానవులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చు. చంద్రునిపై క్యాప్సూల్ నివాసం కూడా నిర్మించనుంది. మానవులు అటువంటి కృత్రిమ ప్రదేశంలో జీవిస్తారని, దీని వాతావరణం భూమిని పోలి ఉంటుందని దీని నుండి స్పష్టమవుతుంది. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న చోట మనిషి ఎముకలు, కండరాలు బలహీనపడతాయని చెప్పారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చూసుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే వాతావరణం ఏర్పడనుంది.

అయితే 21వ శతాబ్దం చివరి నాటికి చంద్రుడు, అంగారకుడిపై మానవులు జీవించడం ప్రారంభిస్తారని జపాన్ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. క్యోటో విశ్వవిద్యాలయం అండ్ కజిమా కన్‌స్ట్రక్షన్ కలిసి ఈ ప్రణాళికను రూపొందించారు. చంద్రుడు, అంగారకుడిపై తయారు చేయబోయే ఈ ‘గ్లాస్’ శంఖువులా ఉంటుంది. ఇక్కడే మానవులు నివసిస్తారు. ఈ భవనం దాదాపు 1300 అడుగుల పొడవు ఉంటుంది. దీనికి కృత్రిమ గురుత్వాకర్షణ ఉంటుంది. అలాగే మనుషులకు అవసరమైన వస్తువులన్నీ ఉంటాయి. ఆహార పదార్థాల నుంచి చెట్లు, మొక్కలు, నీరు, నదులు, ఉద్యానవనాలు, నీటి వనరులు కూడా ఇక్కడే ఉంటాయి. ప్రజా రవాణా కూడా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి ఏర్పాటు చేయనుంది.

ఇక దీని నమూనా 2050 నాటికి సిద్ధం కానుంది. ఇప్పటి నుండే పనులు ప్రారంభమైతే, అది పూర్తి కావడానికి ఒక శతాబ్దం పట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై ఏర్పడే ఈ ‘గ్లాస్’ కాలనీ పేరు లూనాగ్లాస్. మార్స్‌పై ఏర్పడే కాలనీని మార్స్‌గ్లాస్ అని పిలుస్తారు. క్యోటో యూనివర్శిటీ, కజిమా కన్స్ట్రక్షన్ కలిసి స్పేస్ ఎక్స్‌ప్రెస్ అనే బుల్లెట్ రైలులో పని చేయబోతున్నాయి. ఈ రైలు భూమి నుండి చంద్రునికి తరువాత అంగారక గ్రహానికి నడుస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

nine − six =

Back to top button