సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) బృందాలు గురువారం జీరో లైన్ సమీపంలో జరిపిన సెర్చ్ ఆపరేషన్ లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కలిగి ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులకు సమాచారం అందించారు. 6 ఖాళీ మ్యాగజైన్‌లతో కూడిన 3 ఏకే-47 రైఫిళ్లు, 5 ఖాళీ మ్యాగజైన్‌లతో కూడిన 3 మినీ ఏకే-47 రైఫిళ్లు, 6 ఖాళీ మ్యాగజైన్‌లతో 3 పిస్టల్స్, 200 రౌండ్ల మందుగుండు సామగ్రిని బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది. BSF తదుపరి చర్యలకు సంబంధించి పంజాబ్ పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లోని సరిహద్దు జీరో లైన్ సమీపంలో జరిపిన సెర్చింగ్ లో బ్యాగ్ సాయంత్రం 7 గంటలకు రికవరీ చేయబడింది..ఆరు ఖాళీ మ్యాగజైన్‌లతో కూడిన మూడు ఎకె-47 రైఫిళ్లు, ఐదు ఖాళీ మ్యాగజైన్‌లతో కూడిన మరో మూడు ‘మినీ’ ఎకె-47 రైఫిల్స్, ఆరు ఖాళీ మ్యాగజైన్‌లతో కూడిన మూడు పిస్టల్స్, 200 లైవ్ బుల్లెట్లు బ్యాగ్ లో లభించినట్లు బీఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.