More

  అదీ ఇండియన్ ఆర్మీ గొప్పతనం.. బార్డర్ దాటిన బాలుడిని ఏం చేశారంటే..!

  పాకిస్థాన్ కు చెందిన మూడేళ్ల బాలుడు అనుకోకుండా భారత్ సరిహద్దుల్లోకి వచ్చాడు. పాపా.. పాపా అని పిలుస్తూ బిగ్గరగా ఏడస్తూ భారత్ జవాన్లకు కనిపించాడు.

  శుక్రవారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఫీరోజ్ పూర్ సెక్టార్ అంతర్జాతీయ కంచె ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడిని గమనించిన బీఎస్ఎఫ్ దళాలు.. దగ్గరకు తీసుకొని ఓదార్చే ప్రయత్నం చేశారు. నాన్న కావాలి అంటూ బిగ్గరగా ఏడుస్తుండటంతో బాలుడికి తినుబండారాలు, తాగేందుకు నీరు అందించారు.

  దారితప్పి భారత్ సరిహద్దుల్లోకి బాలుడు వచ్చాడని గుర్తించిన జవాన్లు విషయాన్ని పాకిస్థాన్ రేంజర్స్ కు సమాచారం అందించారు. పాక్ రేంజర్ సమక్షంలో రాత్రి 9.45గంటలకు బాలుడిని అతడి తండ్రికి అప్పగించారు. పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకి అనుకోకుండా వచ్చిన మూడేళ్ల పాకిస్తానీ బాలుడిని BSF జవాన్లు అతని కుటుంబానికి అప్పగించినట్లు అధికారులు శనివారం తెలిపారు.

  spot_img

  Trending Stories

  Related Stories