భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ చొరబాటుదారుడు

0
762

జమ్మూ జిల్లాలోని ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లోని ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సరిహద్దు భద్రతా దళం సోమవారం అర్ధరాత్రి పాకిస్థాన్ చొరబాటుదారుడిని కాల్చిచంపిందని అధికారులు ధృవీకరించారు. “ఆదివారం- సోమవారం మధ్య రాత్రి 12:10 గంటల సమయంలో (ఉదయం 12:10), BSF 36 బెటాలియన్ జవాన్లు RS పురా సెక్టార్‌లోని బకర్‌పూర్ సరిహద్దు అవుట్‌పోస్ట్ సమీపంలో ఒక పాకిస్తాన్ చొరబాటుదారుడిని కాల్చి చంపారు. విచారణ నిమిత్తం పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. చొరబాటుదారుడు నలుపు రంగు దుస్తులు ధరించాడు”అని ఒక పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదని బీఎస్ఎఫ్ తెలిపింది.

“ఈరోజు ఉదయం సుమారు 1210 గంటలకు, అప్రమత్తమైన BSF దళాలు సరిహద్దు అవుట్‌పోస్ట్ బక్వార్‌పూర్ సాధారణ ప్రాంతంలో కంచె మీదుగా అనుమానాస్పద కదలికలను గమనించాయి. రాత్రి సమయంలో మా డామినేషన్ పార్టీ ఒక వ్యక్తి పాకిస్తాన్ వైపు నుండి కంచెని దాటాలనే ఉద్దేశ్యంతో రావడం గమనించింది. మా పార్టీ అతన్ని ఆగాలని ఆదేశించింది, కానీ అతను దానిని పట్టించుకోలేదు. భారత్ లోకి చొరబడడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత మా దళాలు చొరబాటుదారుడిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాయి”అని BSF ప్రతినిధి చెప్పారు. తెల్లవారుజామున సెర్చ్ పార్టీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. కంచెకు చాలా దగ్గరగా చొరబాటుదారుడి మృతదేహాన్ని కనుగొన్నారు. అతడి నుంచి ఏమీ లభించకపోవడంతో మృతదేహాన్ని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

జూన్ 30న ప్రారంభమయ్యే వార్షిక అమర్‌నాథ్ తీర్థయాత్రకు ముందు జమ్మూ కశ్మీర్ పోలీసులు సోమవారం లోయలోని దోడా జిల్లాలో ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసి, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దోడా పోలీసులు, భద్రతా దళాలతో కలిసి కోటి దోడా నివాసి గులాం హసన్ కుమారుడు ఫరీద్ అహ్మద్‌గా గుర్తించారు. ఆ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు. అతని వద్ద నుంచి చైనా తయారీ పిస్టల్‌, రెండు మ్యాగజైన్లు, 14 లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.