మిత్రులారా…! మన దేశంలో తిష్టవేసిన సూడో సెక్యులరిస్టులు, కుహానా మేధావులు, ఇచ్చాధారి ఆందోళనజీవులు, ఇంకా దేశానికి వ్యతిరేకంగా అదేపనిగా తప్పుడు కథనాలు రాసే లూటియెన్స్ జర్నలిస్టులు..,! అటు దేశంలో అశాంతిని, వేర్పాటువాదాన్ని రాజేసే ప్రాంతీయ మీడియా, తెలుగు పత్రికలు కోరుకున్నదే జరిగిందా?
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పేరుతో జరుగుతున్న స్పాన్సర్డ్ ఆందోళనలను., గ్లోరిఫై చేస్తూ., తప్పుడు కథనాలను అదేపనిగా ప్రచారం చేశారా?. అలాగే ఇంకా కూడా చేస్తునే ఉన్నారా? ఈ జాతి వ్యతిరేక శక్తులు.. చేస్తున్న ఆరోపణలు ఏంటో తెలుసా? మన భారత దేశంలో ఆందోళనకారులకు భద్రత లేదట..!
దేశ వ్యతిరేక వార్తలను.., అదేపనిగా రాస్తూ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ, ఇదేమని ప్రశ్నిస్తే.., మన దేశంలో మీడియాకు స్వేచ్ఛ లేదంటూ, అంతర్జాతీయంగా…, భారత దేశ ప్రతిష్ఠను బద్నామ్ చేసేందుకు ఈ జాతివిచ్ఛిన్నకర శక్తులు చేయని ప్రయత్నం లేదని తెలుస్తోంది.!
మన దేశంలోని పత్రికలు…మీడియా, ఇంకా ఫెయిడ్ జర్నలిస్టులు, విదేశీ ఫెలోషిప్పులకు ఆశపడే మేధావులు, ప్రొఫెసర్లే.., మన దేశం గురించి తప్పుడు కథనాలను అదేపనిగా ప్రచారం… ప్రసారం చేస్తుంటే…, విదేశాల ముందు మన దేశం పరువు ఉంటుందా? మనం వారి ముందు చులకనకామా? మన దేశ అంతర్గత విషయాలను అంతర్జాతీయ సమాజం ముందు…అంతర్జాతీయ ప్రసార మాద్యమాల్లో చర్చించడం ఎంత వరకు కరెక్టు?
ఇప్పుడు… బ్రిటన్ లోని కొన్ని ఎన్జీవో సంఘాలు ఇదే చేశాయి. అలాగే దేశంలోని పార్టీలు… పార్లమెంటు సభ్యులు సైతం మన దేశానికి వ్యతిరేకంగా… రైతుల ఆందోళనలకు…మద్దతు పలుకుతూ మన దేశ అంతర్గత విషయాల్లో సైతం జోక్యం చేసుకునే సాహసం చేస్తున్నారంటే ఏమనాలి? మార్చి ఎనిమిదో తేదీన ఏకంగా మన దేశానికి వ్యతిరేకంగా బ్రిటన్ పార్లమెంటులో డిబేటే పెట్టారంటే… వారందరూ ఎంతకు బరితెగించారో తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతరేకంగా గత 100 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారంట.! మరి జాతీయ పండుగా అయినా జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ పేరుతో చేసిన విధ్వంసకాండను ఏమనాలి? జాతీయ జెండాను ఎగురవేసే స్థానంలో, ఖాలిస్తాన్ జెండాలను ఎగురవేయాన్ని ఏమనాలి? ఇవేవి తెలుసుకుండా…ఏకపక్షంగా…, భారత అంతర్గత వ్యవహారాల్లో తమకు జోక్యం చేసుకునే హక్కులేదనే ఇంగితం లేకుండా… బ్రిటీష్ పార్లమెంటులో దాదాపు 90 నిమిషాలపాటు చర్చ జరిపారు.
మన దేశం…రైతు ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదని, అలాగే దేశంలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఈ చర్చలో బ్రిటన్ కు చెందిన పలు పార్టీల ఎంపీలు ఆరోపించారు. అంతేకాదు జర్నలిస్టుల భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా రైతు ఆందోళనలకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయడంలో.., మన దేశంలో మీడియా ప్రతినిధులకు స్వేచ్ఛ లేదని కూడా ఆరోపించారు. ఇక ఆదేశానికి చెందిన మంత్రి నీగెల్ ఆడమ్స్ అయితే… బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరికొద్దిరోజుల్లో భారత్ లో పర్యటిస్తారని.., మీడియా స్వేచ్ఛ , రైతుల ఆందోళన అంశాలను పీఎం నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్తారని ఆ దేశ పార్లమెంటు సభ్యులకు హామీ ఇచ్చారు. అసలు బ్రిటన్ పార్లమెంటు సభ్యులు ఏమనుకుంటున్నారు?
భారత్… సార్వభౌమాధికార దేశం.! మన దేశం ఏ దేశానికి సబార్డినెట్ కాదు..! మన దేశ పార్లమెంటు ఆమోదించిన చట్టాలపై బ్రిటన్ పార్లమెంటులో చర్చిచడమే అంతర్జాతీయ సూత్రాలకు విరుద్ధం.! ఇది మన దేశ ప్రతిష్ఠను దిగజార్చడం, అగౌరపర్చడం..! మన దేశ అంతర్గత విషయాల్లో బ్రిటన్ పార్లమెంటు సభ్యులకు జోక్యం చేసుకునే హక్కులేదు. కానీ వారు హద్దు మిరారు. ఆఫ్ నాలెడ్జ్ తో అసలు విషయాలు తెలుసుకోకుండానే…, టూల్ కిట్ గ్యాంగ్, ఖలిస్తాన్ వేర్పాటువాదులు, అలాగే మన దేశంలో మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే, కొన్ని నేషనల్ మీడియా చానెళ్లు, అలాగే ప్రాంతీయ మీడియా చానెళ్లు, అలాగే కొంతమంది ఫెయిడ్ లూటియెన్స్ జర్నలిస్టులు చేస్తున్న వన్ సైడెడ్ తప్పుడు వర్షన్ ను పరిగణలోకి తీసుకుని…, మన భారత్ కే సలహాలు ఇచ్చే సాహసం చేశారు బ్రిటీష్ పార్లమెంటు సభ్యులు.! వీరిలో కొంతమందికి ఖలిస్తాన్ సానుభూతిపరులు, ప్రొ పాకిస్తాన్ వాదులు కూడా ఉన్నారని కూడా తెలుస్తోంది.
ఏమిటీ…మన దేశంలో… మీడియాకు నిజంగా స్వేచ్ఛ లేదా? మీడియా స్వేచ్ఛ అనేదే లేకపోతే…, మన తెలుగు ప్రాంతీయ చానళ్లు, పత్రికల నుంచి మొదలు పెడితే…, నేషనల్ మీడియాలోని కొన్ని చానెళ్లు, మరి ముఖ్యంగా రాజ్ దీప్ సర్దేశ్, బర్ఖాదత్, ఎన్డీటీవీ రవీష్ కుమార్ లాంటి జర్నలిస్టులు ప్రతి రోజు ఫ్రైమ్ టైమ్ న్యూస్ లో…, పదే పదే…, కేంద్ర ప్రభుత్వంపై బయాజ్డ్ గా తప్పుడు విమర్శలు, కథనాలను ప్రసారాలను చేయగలుగుతున్నారో దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు!
అంతేకాదు బ్రిటన్ పార్లమెంటులో మన దేశానికి సంబంధించిన రైతుల ఆందోళన, అలాగే మీడియాకు స్వేచ్ఛ లేదంటూ చర్చ జరపడాన్ని మొదటగా… మన నేషనల్ మీడియా… అలాగే జర్నలిస్టులందరూ ఖండించడం.. దేశం పట్ల కనీస బాధ్యత..! కానీ ఏం చేస్తాం! కనీసం బ్రిటన్ పార్లమెంటులో జరిగిన డిబేట్ తప్పు…అంటూ ఖండించేందుకు ఈ లూటియెన్స్ జర్నలిస్టులు, ప్రాంతీయవాద, వేర్పాటువాద., తెలుగు మీడియా జర్నలిస్టులేవరు కూడా ముందుకు రాలేదు.!
అయితే వాళ్లు రాకపోతేనేం…! జాతీయవాదమే ఉపిరిగా, మనసా వాచా కర్మనా .., దేశ హితాన్ని కోరుకునే నేషనలిస్ట్ హబ్… జర్నలిస్టులుగా… మేమూ…, బ్రిటన్ పార్లమెంటులో జరిగిన భారత వ్యతిరేక డిబేట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం.!
దేశ ప్రజలారా ఇప్పటికైనా అర్థమౌతోందా? మన దేశ ఔనత్యాన్ని… మన సార్వభౌమత్వాన్నే దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, మీడియా అనే ముసుగు వేసుకున్న ఈ జాతి విచ్ఛిన్నకర శక్తులకు తగిన బుద్ది చెప్పాల్సిన సమయం అసన్నమైంది.
మరోవైపు… బ్రిటన్ పార్లమెంటులో జరిగిన ఈ డిబేట్ ను భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించింది. తప్పుడు వాదనలతో… కనీసం నిజా నిజాలు తెలుసుకోకుండా.. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ పై నిందలు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని లండన్ లో భారత హై కమిషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఒక్క బ్రిటనే కాదు., యూరోప్ దేశాలతోపాటు, అనేక ప్రపంచ దేశాల మీడియా సంస్థలు భారత్ లో ఉన్నాయి., అవన్ని కూడా రైతుల ఆందోళనలపై.., కల్పిత కథనాలను ప్రసారం చేస్తున్నా… భారత ప్రభుత్వం వాటిని అడ్డుకోలేదనే విషయాన్ని గుర్తించాలని ఆ ప్రకటనలో భారత హై కమిషన్ పేర్కొంది.