పెళ్లి పీటలపై కూర్చున్న వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే వధువు కుప్పకూలింది. ఏమైందా అని అందరూ అనుకుంటూ ఉన్న సమయంలోనే వధువు చనిపోయిందన్న పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. విశాఖలోని మధురవాడలో గురువారం నాడు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ తో సృజన పెళ్లి చేసుకుంటూ ఉండగా.. పెళ్లి కుమార్తె పీటలమీదనే కుప్పకూలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్దారించారు. ఈ క్రమంలో ఆమె శరీరంలో విషపదార్థం ఉన్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం సృజన మృతదేహాన్ని కేజిహెచ్ కు పోస్ట్ మార్టం కోసం తరలించారు. సృజన శరీరంలో విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందనే కథనాలను తెలుగు మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి. బుధవారం సాయంత్రం 7 గంటలకు వివాహ ముహూర్తం కాగా.. సరిగా ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు సృజన పెళ్లి పీటలపైనే స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత దారుణ వార్త వినాల్సి వచ్చింది.