More

    యాదాద్రిలో మొదలైన బ్రేక్ దర్శనాలు.. నవంబర్ 8న ఆలయం మూసివేత

    తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు రెండు గంటలపాటు బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా రెండు దఫాలుగా 292 మంది భక్తులు ఈ టికెట్లు తీసుకోగా.. వీటి ద్వారా రూ. 87,600 ఆదాయం సమకూరినట్టు తెలిపారు. కార్తీకమాసం తొలి సోమవారం నాడు 354 జంటలు సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొన్నాయి. వీటి ద్వారా రూ. 2,83,200 ఆదాయం ఆలయానికి సమకూరింది. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 8న యాదాద్రిలోని ప్రధాన, అనుబంధ ఆలయాలను మూసివేయనున్నారు. ఆ రోజున ఉదయం 8.15 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ద్వారబంధనం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

    Trending Stories

    Related Stories