More

    ఆ పాటలు పాడనందుకు సింగర్ కైలాష్ ఖేర్ పై దాడి..!

    కర్ణాటకలో సింగర్ కైలాష్ ఖేర్పై దాడి చేశారు. హంపీలో ఆయనపై పలువురు యువకులు దాడికి పాల్పడ్డారు. హంపీ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సంగీత కచేరిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్ పై పాటలు పాడుతుండగా కొందరు యువకులు ఆయనపై వాటర్ బాటిల్ విసిరారు. కైలాష్ ఖేర్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తన ప్రదర్శనను కొనసాగించారు. బాటిల్ విసిరిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నడ పాటలు పాడనందుకే వారు బాటిల్ విసిరారని తెలుస్తోంది.

    హంపి ఉత్సవ్ ముగింపు కార్యక్రమంలో గాయకుడు హిందీ పాటలు మాత్రమే పాడారని ఆగ్రహం వ్యక్తం చేసిన జనం అతనిపై బాటిల్ విసిరినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు స్థానికులు ప్రదీప్, సూరా లను అరెస్టు చేశామని.. వారి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో హంపీ ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగిన ఈ వేడుకల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగర సామ్రాజ్య వారసత్వాన్ని గుర్తుచేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది.

    Trending Stories

    Related Stories