International

పుతిన్ అలా పుట్టి ఉంటే యుద్ధం జరిగేది కాదు..!

ఉ‍క్రెయిన్‌ యుద్ధంతో వేలమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్కచేయకుండా రష్యన్‌ బలగాలతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో.. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, పుతిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒక‌వేళ పుతిన్ మ‌హిళ అయి ఉంటే, అప్పుడు ఉక్రెయిన్‌పై అత‌ను యుద్ధం చేసేవాడు కాదు అని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ అన్నారు. జ‌ర్మ‌నీ మీడియా సంస్థ జేడీఎఫ్‌తో మాట్లాడుతూ బోరిస్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ పుతిన్ ఆడ‌దై ఉంటే, నిజానికి కాదు అనుకోండి, కానీ ఒక‌వేళ అయి ఉంటే, బ‌హుశా అత‌ను ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లి ఉండేవాడు కాదు అని బ్రిట‌న్ ప్ర‌ధాని తెలిపారు. ఉక్రెయిన్‌పై ఆక్ర‌మ‌ణ‌కు వెళ్ల‌డం అంటే అది విష‌పూరిత‌మైన మ‌గ‌బుద్ధి అని బోరిస్ అన్నారు.

అమ్మాయిల‌కు ఉత్త‌మ చ‌దువును అందించాల‌ని కోరుకున్నారు. శ‌క్తివంత‌మైన స్థానాల్లో మ‌హిళ‌లు అధిక సంఖ్య‌లో ఉండాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం ఆగాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని, కానీ ప్ర‌స్థుత ప‌రిస్థితుల్లో ఆ సంకేతం అంద‌డం లేద‌ని, ఎందుకంటే పుతిన్ ఎటువంటి శాంతి హ‌స్తాన్ని అందించ‌డంలేద‌ని బోరిస్ తెలిపారు. ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే అంశంలో ప‌శ్చిమ దేశాలు వ్యూహాత్మ‌కంగా కీల‌క‌మైన స్థానంలో ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

seventeen + twenty =

Back to top button