More

    పల్లెలన్నీ నిఘానేత్రాలే

    దేశ సరిహద్దు పల్లెలు యుద్ధంలో తోడు నిలుస్తాయి. శత్రువు ఆనవాళ్లు ముందే పసిగట్టి గుట్టును సైన్యానికి చేరవేస్తాయి. అక్కడి పల్లెలన్నీ నిఘానేత్రాలే. పల్లెలే కాదు, పశువుల కాపర్లు, సంచారజాతులూ సైన్యాన్ని కంటికి రెప్పలా కాపాడాతాయి. భారతదేశ సరిహద్దుల్లోని గ్రామాలు చేస్తున్న దేశసేవ చాలా మందికి తెలియదు.
    వ్యూహాత్మక ప్రాంతమైన కార్గిల్ సెక్టార్ లో పాకిస్థాన్ చొరబాట్లను గుర్తించి సమాచారం అందించిన తాషి నామ్ గ్యాల్ స్థానికంగా నివసించే గొర్రెల కాపరి. నామ్ గ్యాల్ సమాచారం వల్లే సైన్యం అప్రమత్తమైంది. భారత సైన్యం చొరబాటుదాలపై విరుచుకుపడి మట్టుబెట్టింది. యుద్ధంలో తొలితూటా పేల్చినవాడిదే విజయమని యుద్ధం కళ చెపుతుంది.
    ఒక గొర్రెలకాపరి ఇచ్చిన సమాచారం మొత్తం యుద్ధ లక్షణాన్ని మార్చింది. కార్గిల్ యుద్ధం విజయవంతమైంది. కానీ ఇప్పుడాపల్లెలన్నీ వల్లకాడయ్యాయి. పూటగడవక, సౌకర్యాలు లేక, వాతావరణాన్ని తట్టుకునే సరైన గృహవసతి లేక, ప్రాణవాయువు అందక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వందలాది గ్రామాలు దిక్కుతెలియని ప్రాంతాలకు వలసవెళ్లిపోయాయి.
    సరిహద్దు గ్రామాల వలస దేశ భద్రతకు ప్రమాదంగా పరిణమించింది. ఖాళీ అయిన గ్రామాల్లో నేపాల్ చోరబాటుదారులు తిష్ఠవేస్తున్నారు. ఉత్తరాఖండ్ లో భారీ నేరాలు చేసి తిరిగి దేశందాటి పోతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న రాష్ట్రం. పొరుగునే డ్రాగన్ మాటువేసిన ప్రాంతం.
    ఒకవైపు చైనా తన సరికొత్త సైనిక డాక్ట్రైన్ లో ‘‘BORDER DEFENCE VILLAGES’’ వ్యూహం అమలు గురించి ప్రస్తావించడమే తడవుగా గతేడాది సెప్టెంబర్ 26 నాటికి 400 కిలోమీటర్ల నియంత్రణరేఖ పొడవునా 680 గ్రామాలను యాంత్రికంగా నిర్మించింది. వీటికి షౌఖాంగ్ అని పేరు పెట్టింది. మరి మన సరిహద్దుల్లో ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలను మాత్రం ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. ఇప్పుడిప్పుడే వారిని గ్రామాలకు రప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏళ్లుగా విస్మరణకు గురైన పనులు అంత సులువుగా నెరవేరకు. నత్తనడకన సాగుతున్నాయి.

    సరిహద్దుల్లో ఉండే గ్రామాల గురించి షహీద్ బిపిన్ రావత్ ఏమన్నారు? సరిహద్దు గ్రామాలు ఖాళీ అయితే దేశ రక్షణకు వచ్చే ప్రమాదమేంటి? వలసలకు కారణమేంటి? సరిహధ్దు గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండటానికి కారణమెవరు? ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత పంక్తుల్లోని GHOST VILLAGES లో మాటువేసిందెవరు? ఉత్తరాఖండ్ ఎందుకు కీలక రాష్ట్రం? ఉత్తరకాశీ, పిత్తోరోగఢ్, చమోలీ ప్రాంతాల్లో ఏం జరుగుతోంది? ముస్లీం అక్రమవలదారుల మాటేంటి?
    ఇలాంటి ప్రశ్నలకు నేను… Centre for land warfare studies-CLAWS అనే వ్యూహాత్మక అంశాల పరిశోధన సంస్థ ప్రచురించే ‘ISSUE BRIEF” పత్రిక జనవరి సంచికలో వచ్చిన ‘‘Migration a Challenge to National Security: An Assessment of Harsil, Mana-Malari and Tawaghat Sector of Uttarakhand’’ వ్యాసం నుంచి కొంతమేర తీసుకుంటున్నాను. ఈ వ్యాసాన్ని CLAWS రిసెర్చ్ అసిస్టెంట్ వైభవ్ కులశ్రీ రాశారు.
    జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లోని అతి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనేక కారణాల వల్ల వలస వెళ్లిపోతున్నారు. కొంతమంది శీతాకాలాన్ని తట్టుకోలేక వెళ్లిపోయి… మళ్లీ ఎప్పటికో తిరిగొస్తున్నారు.. అయితే సంచార తెగల వలస మాత్రం కొంత ఇంటలీజెన్స్ సేకరణ, పర్యావరణ సమతుల్యత కాపడటం లాంటి ప్రయోజనాలున్నాయి. కానీ వారి విషయంలో ప్రభుత్వాలకు నిర్దిష్టమైన విధానం ఉండటం లేదు. దీంతో వారి జీవితాల్లో దశాబ్దాలుగా ఎలాంటి మార్పూ లేదు.
    మరి కొంతమంది రవాణా సౌకర్యాల లేమి, ఉపాధి లేకపోవడం, రహదారి వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉండటం వల్ల సుదూర ప్రాంతాలకు, రాష్ట్రాలకు సొంత ఇళ్లు వదిలి శాశ్వతంగా వలస వెళ్లిపోతున్నారు. కేవలం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గడచిన దశాబ్ద కాలంలో 5 లక్షల మంది ప్రజలు శాశ్వతంగా వలసవెళ్లిపోయారు. లక్ష18వేల961 ఇళ్లు శాశ్వతంగా నిర్మానుష్యమయ్యాయి. బిపిన్ రావత్ సైతం ఈ వలసలపై ఆందోళన చెందారు. ఇలాంటి స్థితి దేశ భద్రతకు ప్రమాదమని కూడా హెచ్చరించారు. గ్రామాలను దేశ రక్షణలో వ్యూహాత్మక ఆస్తిగా పేర్కొన్నారు.

    మన సరిహద్దులను ఎలా విభజించారో చూద్దాం:
    ఉత్తరాఖండ్- టిబెట్ ల మధ్య 365 కిమీటర్ల సుధీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు ఉంది. సరిహద్దును స్థూలంగా మూడు సబ్ సెక్టార్లుగా విభజించారు. మొదటి సెక్టార్ లో 1. హార్సిల్ దీన్ని మనం ఉత్తరకాశీ అంటాం. 1. ‘‘మన మలారీ’’ దీన్ని మనం చమోలీగా పేర్కొంటాం. 3. తవాఘట్ దీన్ని మనం పిత్తోర్ ఘర్ అంటాం. ఉత్తరాఖండ్-హిమాచల్ ప్రదేశ్ లను మధ్య సెక్టార్ గా చేశారు. పశ్చిమ సెక్టర్ గా లఢక్ ఉంది. తూర్పు సెక్టార్ లో…సిక్కీం, అరుణాచల్ ప్రదేశ్ లు ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నీ కలిపి మొత్తం 4వేల 57 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ ఉంది.
    ఉత్తరాఖండ్ అంతర్జాతీయ సరిహద్దుకు ఎందుకు ప్రాముఖ్యత ఉందో చూద్దాం.
    ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ, చమోలీ, పిత్తోర్ గఢ్ జిల్లాలు లు చైనాకు పూర్తిగా అతిసమీపంలో ఉంటాయి. ఈ సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలే ప్రస్తుతం వలసబాటపట్టారు. వందలకొద్దీ గ్రామాలు నిర్మానుశ్యమయ్యాయి. వీటినే ‘ఘోస్ట్ విలేజెస్’ పేర్కొంటున్నారు. ఒక్క పౌరీ ఘర్ వాల్ జిల్లాలో 186 గ్రామాలు ఘెస్ట్ విలేజెస్ గా ప్రభుత్వం తేల్చింది. ఇందులో గతేడాది మే 30న, చౌందిలీ అనే గ్రామానికి సంబంధించిన 40 కుటుంబాలు మాత్రం 8 ఏళ్ల తరువాత వచ్చి స్థిరపడ్డాయి. మొత్తం ఉత్తరాఖండ్ లో 1700 ఘోస్ట్ విలేజెస్ ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వలసకు మరో ముఖ్యకారణం ప్రాణవాయువు అందని స్థితి.
    ఇంటర్ నెట్, విద్యుత్ సౌకర్యం లేకపోవడం. వలసవెళ్లిపోతున్నవారిలో 26 నుంచి 35 ఏళ్ల వయస్సున్నవారే! రాష్ట్ర ఉత్పత్తిలో నిర్ణాయకపాత్ర పోషించేవారే వెళ్లిపోవడంతో ఉత్తరాఖండ్ ఆర్థికవృద్ధిపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ఈ ప్రాంతంలో ఓ సూక్తి ఉంది..‘‘ఈ హిమగిరుల్లోని నవయుత, ప్రవహించేజల…ఈ పర్వతసానువులకు ఏమీ చేయలేని దుఖం వెడలిపోయింది…’’ అని. ఈ సూక్తిని వింటే హిమాలయవాసుల వేదన అర్థమవుతుంది.
    వలసవెళ్లినవారంతా ఉత్తరాఖండ్ లోని మైదాన ప్రాంతాలకూ, ముఖ్యంగా ఉద్ధమ్ సింగ్ నగర్, డెహ్రడూన్ కు వలస వెళుతున్నారు. దీంతో నగరీకరణ పెరిగి నీటికటకటతో పాటు ఇతర సమస్యలు చుట్టుముడుతున్నాయి. కొన్నిసీజనల్ గ్రామాలు కూడా ఉన్నాయి. కొంతకాలం గ్రామంలో, మరికొంత కాలం జోషీమఠ్, పండుకేశ్వర్ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు.

    పిత్తోడ్ గఢ్ జిల్లాలోని దారూచలా పట్టణం నుంచి నేపాలీలు ఉత్తరాఖండ్ లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. నిర్మానుష్య గ్రామాల్లో తిష్ఠవేస్తున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు. నేపాలీ అక్రమవలదారులను గుర్తించడం ఉత్తరాఖండ్ పోలీసులకు సవాల్ గా మారింది. మహాకాళీ నది వద్ద సశస్త్ర సీమా బలగాలు మాటు వేసినా ఫలితం ఉండటం లేదు. కట్ ఆఫ్ ఏరియాల్లో తీగలు వేసి నేపాలీలు మహాకాళీ నది దాటి వస్తున్నారు.
    గతేడాది అక్టోబర్ 12న Opindia పత్రిక మరో కుట్రను బయటపెట్టింది. ‘‘Sudden increase in Muslim migrant population, hundreds of madarsas, mosques popped up in last 2 years: Demographic shift haunting Uttarakhand’’ అనేది ఈ కథనం శీర్షిక.
    ఓ సెక్యూరిటీ ఏజెన్సీ హోం శాఖకు అందించిన నివేదికలో కుమావున్, ఉద్ధమ్ సింగ్ నగర్, చంపావత్ తో పాటు పిత్తోర్ గఢ్ జిల్లా కూడా ఉంది. ముఖ్యంగా పిత్తోర్ గఢ్, దారుచాలా, జావుల్జీవి పట్టణాల జనాభా నిష్పత్తి మారుతోందని ఈ నివేదిక పేర్కొన్నట్టూ ఓప్ ఇండియా కథనం వెల్లడించింది. ఉత్తర భాగంలోని నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గర్లోని బారూచ్ లో గడచిన రెండేళ్లలో 4 వందల మసీదులను కొత్తగా నిర్మించినట్టూ, మరిన్ని మదర్సాలు వచ్చినట్టూ ఈ కథనం పేర్కొంది. గోరఖ్ పూర్-బస్తీ సరిహద్దుల్లో కూడా జనాభా నిష్పత్తి మారుతున్నట్టూ తెలిపింది.
    ఇక దైనిక్ జాగర్ నివేదికలో ఏముందో చూద్దాం. ఇలా వలసవచ్చిన వారికి ముందే లక్ష్యాలు సూచించారనీ, ఉత్తరాఖండ్, బంగ్లాదేశ్, బిహార్, నేపాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ లకు వెళ్లి తమ కార్యకలాపాలు ఉధృతం చేయాలన్న ఆదేశాలున్నాయని పేర్కొంది. ‘యుద్ధ విధానికి అనుగుణంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో మదర్సాలు నిర్మించాలని ఐఎస్ఐ వీరిని పురమాయించినట్టూ దైనిక్ జాగరణ్ కథనం పేర్కొంది.
    కుమవూన్ రీజియన్ లోని నైనిటాల్ పట్టణం అక్రమవలదారులతో నిండడంతో జనాభా నిష్పత్తి మారిపోయింది. నైనిటాల్ పట్టణంలోని CRST పాఠశాల వెనుక భాగంలో, భరత్ పూర్ తో పాటు ఇతర ఎత్తైన ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయనీ, వీటిలో ఉంటున్న వారంతా అక్రమంగా దేశంలోకి చొరబడిన ముస్లీంలని దైనిక్ జాగరణ్ నివేదిక పేర్కొంది.
    చైనా ప్రమాదాన్ని గుర్తించిన కేంద్రం ఉత్తరాఖండ్ వలసలను తీవ్రంగా పరిగణించింది. 2018లో ‘‘పలాయన్ ఆయోగ్’’ అంటే ‘Migration Commission’ ను నియమించింది. పదేళ్లుగా వలసవెళుతున్నవారి గణాంకాలు తీయాలని ఆదేశించింది. ‘‘Border Area Development Programme’’ పేరుతో అభివృద్ధిపనులను ప్రారంభించింది.
    ఇన్నర్ లైన్ పర్మిట్ నిబంధనలను కాస్త సడలించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రల్లోని విశ్రాంత సైనికులు, ఇతర హోదాల్లో పనిచేసిన అధికారులకు ఉద్యోగాలను ఇవ్వడం వల్ల కూడా పరిస్థితి మెరుగుపడుతుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాకుండా సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వలసలు నివారించేందుకు అభివృద్ధిపనులను చేపట్టాలని ఆదేశించింది.
    ఇదీ మొత్తంగా సరిహద్దు రాష్ట్రాల్లోని గ్రామాలు నిర్మానుష్యమవడంతో పొరుగుదేశాలు దీన్ని అవకాశంగా మలచుకుంటున్నాయి. చాపకింది నీరులా సాగుతున్న విచ్ఛిన్నకర కుట్రలు బదాబదలవుతాయని ఆశిద్దాం.

    Trending Stories

    Related Stories