బీజేపీలోకి బూర నర్సయ్యగౌడ్!

0
1034

మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌‎కు మరో షాక్‌ తగలనుంది. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భేటీ అనంతరం బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన సంకేతాలిచ్చారు. మునుగోడు నుంచి పోటీ చేయాలని భావించిన బూర నర్సయ్యగౌడ్‎కు టికెట్‌ దక్కపోవడంతో బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‎షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. నిన్న కూసుకుంట్ల నామినేషన్‌ పూర్తయిన తర్వాత బీజేపీ నేతలను బూర నర్సయ్యగౌడ్‌ కలిశారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

twenty − nineteen =