National

రెమ్దెసివిర్ స్టాక్ లేదట.. సినిమా స్టార్స్ కు, రాజకీయనాయకులకు ఎలా దొరుకుతున్నాయి..?

కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సమయంలో కొన్ని ప్రాంతాల్లో చికిత్సకు ఉపయోగించే మందులు అందుబాటులో ఉండడం లేదు. మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ అందుబాటులో లేదని, రెమ్దెసివిర్ స్టాక్ అయిపోయిందని చెబుతూ ఉన్నారు. ఓ వైపు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే.. కొందరు సినిమా స్టార్స్ మాత్రం సోషల్ మీడియాలో తమ దగ్గర ఉన్నాయని మీ సమస్యలు తీరుస్తామంటూ చెబుతూ ఉన్నారు. చాలా మంది బాలీవుడ్ స్టార్స్, రాజకీయ నాయకులు ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్దెసివిర్, టోసిలిజుబామ్ వంటివి అందిస్తామని సోషల్ మీడియా ద్వారా పలువురికి చెబుతూ ఉన్నారు. ఫాలోవర్లు కొందరు అడగడం.. వారికి వీరు అందిస్తూ ఉండడం వంటివి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అందరికీ కనిపిస్తూ ఉన్నాయి.
కొందరు సామాన్యులకు అసలు దొరక్కుండా ఉన్న ఈ మందులు.. బాలీవుడ్ స్టార్స్, రాజకీయ నాయకులకు ఎలా దొరుకుతున్నాయనే అంశంపై బాంబే హై కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఓ వైపు మందులు దొరకడం లేదని చెబుతూ ఉన్నారు సరే.. మరి సదరు స్టార్స్ ఉచితంగా ఎలా పంచగలుగుతున్నారని బాంబే హై కోర్టు ప్రశ్నించింది. పలువురు వేసిన పి.ఐ.ఎల్.లను పరిశీలించిన బాంబే హై కోర్టు వారికి ఈ మందులు ఎలా దొరుకుతూ ఉన్నాయో తెలుసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
అడ్వొకేట్ రాజేష్ ఇనాందార్ తన పిల్ లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్, ఎన్.సి.పి.నేత జీషన్ సిద్దిఖీకి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను కూడా పొందుపరిచారు. దేశంలోని చాలా ప్రాంతాలకు వీరు ఈ మందులను పంపించగలుగుతూ ఉన్నారని.. ఇతరులకు దొరక్కుండా ఉన్న ఈ మందులు వీళ్లకు మాత్రమే ఎలా అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని కోరారు. చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణి మాట్లాడుతూ ఈ మందులను కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అందించిందని.. అయితే సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులకు ఎలా దొరుకుతున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెమ్దెసివిర్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తూ ఉన్నప్పుడు సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల చేతుల్లోకి ఎలా వెళ్తున్నాయో చెప్పాలని ప్రభుత్వానికి అందించిన ఆర్డర్ లో బాంబే హై కోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ఘటనల వలన బ్లాక్ మార్కెట్ కూడా పెరిగిపోయే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ఇలా అందించడం వెనుక దొంగగా దాచిపెట్టడం, అక్రమ పంపిణీ కిందకు వస్తాయని కూడా అభిప్రాయపడింది. కరోనా డ్రగ్స్ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 + seven =

Back to top button