More

    గిరి పుత్రుల ఆరాధ్యుడు లక్ష్మణానంద ఆశ్రమానికి బాంబు బెదిరింపు

    ఒడిశా రాష్ట్రంలోని కొంధమాల్ జిల్లాలోని దివంగత సాధువు స్వామి లక్ష్మణానంద సరస్వతి ఆశ్రమానికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన ఆశ్రమ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.ప్రస్తుతం జాలెస్పటాలో ఆశ్రమ నిర్వాహకులుగా స్వామి జీవన్ముక్తనంద ఉన్నారు.  ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఫోన్ చేసిన ఆగంతకుడు తనను తాను నక్సల్ గా పరిచయం చేసుకున్నాడు. స్వామిజీని చంపేయడంతోపాటు…ఆశ్రమాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తామని హెచ్చరించాడు. మరుసటి రోజు ఆదివారం ఉదయం కూడా ఆశ్రయమానికి ఇదేరకమైన బెదరింపు రావడంతో…, స్వామిజీ ఈ విషయాన్ని స్థానిక విశ్వహిందూ పరిషత్ నేతలకు, అలాగే బీజేపీ ఎమ్మెల్యేలకు తెలిపారు. అలాగే పోలీస్ స్టేషన్ వెళ్లి బెదిరింపు కాల్ పై కంప్లెంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆశ్రయమంలో తనిఖీలు నిర్వహించారు. ఆశ్రమానికి సెక్యురిటీని పెంచారు. ఆశ్రమంలో పనిచేసిన మాజీ ఉద్యోగే ఈ బెదిరింపు కాల్ చేశాడని పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఆశ్రమంలో అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో… అతన్ని ఆశ్రమ విధుల నుంచి ….తొలగించడంతో కక్షతోనే బెదిరింపు కాల్ చేశాడని పోలీసులు చెబుతున్నారు.

    1924లో కంధమాల్ జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతమైన గురుజంగ్ గ్రామంలో జన్మించిన స్వామి లక్ష్మణానంద సరస్వతి…. తన కుటుంబ జీవితాన్ని త్యజించి, తన ఇద్దరు ఇద్దరు పిల్లలను వదులుకుని, ఆధ్యాత్మిక సాధన కోసం హిమాలయాలకు వెళ్లారు. అక్కడే సన్యాస దీక్ష తీసుకుని…గో సేవాలో గడిపారు. తన గురువుగారి ఆజ్ఞమేరకు…. తన స్వస్థలానికి తిరిగి వచ్చారు.  ఒడిశాలోని మారుమూల అటవీ ప్రాంతంలో 1965 ప్రాంతంలో ఆశ్రమాలను ఏర్పాటు చేశారు స్వామి లక్ష్మణానంద.!  ఈ ఆశ్రమాల కేంద్రంగా గిరిజన విద్యార్థులకు విద్యా బోధన చేసేశారు. పాఠశాలలు, వసతి గృహాలను సైతం ఏర్పాటు చేశారు. అలాగే  కాలినడకన గిరిజన గ్రామాల్లో తిరుగుతూ సత్ సంఘ్ కార్యక్రమాలను నిర్వహించి…క్రైస్తవ మాత మార్పిడీలను అడ్డుకున్నారు. తమ ప్రాచీన ధర్మాన్ని వదిలి… క్రైస్తవం స్వీకరించిన అనేక మంది గిరిపుత్రులు క్రైస్తవం వదిలి… తిరిగి స్వధర్మానికి రాసాగారు. అటు స్వామీజీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు…మావోయిస్టులకు సైతం కంటగింపుగా మారాయి. అంత వరకు కూడా గిరిజనులకు మావోయిస్టులే సర్వంగా ఉండేవారు. స్వామీజీ రాకతో వారి రిక్యూట్ మెంట్లకు సైతం అడ్డుకట్టపడింది. స్వామీజీ పిలుపు మేరకు… గిరిజన గ్రామాల్లో వారి దైవమైన జగన్నాథ రథయాత్రలు మళ్లీ ప్రారంభం అయ్యాయి.

    దీంతో అటు మావోయిస్టు మూకలు…ఇటు క్రైస్తవ మిషనరీలు స్వామి లక్ష్మణానంద సరస్వతిపై కత్తిగట్టాయి. 1970 నుంచి 2008  మధ్యకాలంలో వారిపై 8 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. అయితే ఇవేవీ కూడా స్వామిజీ ధర్మదీక్షకు అడ్డుకోలేకపోయాయి. తన సేవా కార్యక్రమాలను కొనసాగించారు స్వామీజీ.

    అయితే…2008 ఆగస్టు 23న ఆశ్రమంలో శ్రీకృష్ణ జన్మష్ఠమి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతుండగా… ఏకే 47 చేతబడ్డిన సాయుధలైన 15 మంది తీవ్రవాదులు ఆశ్రమంలో ప్రవేశించి… మొదట బాబా అమృతానంద స్వామిజీని…, స్వామి లక్ష్మానంద గా భావించి కాల్చిచంపారు. ఆశ్రయంలో తీవ్రవాదులు ప్రవేశించారనే విషయం తెలుసకుని మిగిలిన భక్తులు…, విద్యార్థులు..,  స్వామిజీని రక్షించే ప్రయత్నం చేశారు. మాత భక్తమయిని, స్వామిజీకి రక్షణ నిలిచిన కిశోర్ బాబాలను హత్య చేశారు. ఆ తర్వాత 84 ఏళ్ళ స్వామి లక్ష్మణానందపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

    స్వామీజీ హత్యాను తట్టుకోలేని గిరిజనులు… కొంధమాల్ జిల్లాలో తిరగబడ్డారు. అనేక రోజులపాటు కొంధమాల్ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. గతంలో 8 సార్లు శ్రీ లక్ష్మణానంద సరస్వతి స్వామీజీపై హత్యాయత్నం జరిగినప్పటికీ ఆనాటి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఎలాంటి భద్రతా కల్పించలేదు. అంతేకాదు స్వామిజీ హత్య రోజు అక్కడ ఉన్న ఒకే ఒక సెక్యూరిటీ గార్డు సెలవుపై వెళ్లిపోవడం, అతని స్థానంలో మరో సెక్యూరిటీ గార్డు ప్రత్యామ్నాయంగా నియమించకపోవడంపై పలు అనుమాలు వ్యక్తం అయ్యాయి. స్వామీజీ హత్యపై నాటి యూపీఏ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు.

    Trending Stories

    Related Stories