More

    తీవ్రవాది హఫీజ్ సయీద్ ఇంటి వద్ద భారీ పేలుడు

    ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబా కోఫౌండర్ హఫీజ్ సయీద్ ఇంటికి సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారని, 16 మందికి పైగా గాయపడ్డారని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. ఈ పేలుడు కారణంగా హఫీజ్ సయీద్ ఇంటి కిటికీలు కూడా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. సిలిండర్ పేలడం వల్ల ఈ పేలుడు సంభవించిందా లేదా.. హఫీజ్ సయీద్ ఇంటికి సమీపంలో అనుకోకుండా బాంబు పేలుడు జరిగిందా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. గుర్తు తెలియని వ్యక్తి ఇంటి దగ్గర మోటారుసైకిల్‌ను ఆపి ఉంచాడని కూడా వార్తలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న భద్రతా సిబ్బంది ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

    Pakistan: Blast near terrorist leader Hafiz Saeed's house in Lahore leaves  2 dead, 12 injured

    జోహార్ టౌన్ లోని హఫీజ్ సయీద్ నివాసం నుండి 120 మీటర్ల దూరంలో ఉన్న ఇంట్లో పేలుడు సంభవించింది. లాహోర్ పోలీస్ చీఫ్ గులాం మెహమూద్ డోగర్ విలేకరులతో మాట్లాడుతూ గాయపడిన వారిలో ఇద్దరు జిన్నా ఆసుపత్రిలో మరణించారని తెలిపారు. సయీద్‌కు జోహార్ టౌన్‌లో చాలాకాలంగా ఇల్లు ఉంది. పలు కేసులలో నిందితుడైన హఫీజ్ సయీద్ ను గత సంవత్సరం పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం లాహోర్ జైలులో ఉన్నాడు. “బాంబు పేలుడు” గా భావిస్తున్న అధికారులు ప్రస్తుతానికి విచారణ చేస్తూ ఉన్నారు. లాహోర్ డిప్యూటీ కమిషనర్ ముదాసిర్ రియాజ్ మాలిక్ విలేకరులతో మాట్లాడుతూ దర్యాప్తు జరిపిన తరువాత మాత్రమే కారణాన్ని గుర్తించగలమని చెప్పాడు.

    Trending news: Hafiz Saeed: Massive bomb blast near Lashkar terrorist Hafiz  Saeed's house in Lahore, one dead, 16 injured - Hindustan News Hub

    గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు, ఒక పోలీసు అధికారి ఉన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని మీడియా తెలిపింది. టీవీ ఛానెళ్లలో ప్రసారం చేసిన చిత్రాల ఆధారంగా పెద్ద పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడులో అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. సమీపంలోని అనేక ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి.

    Blast in Lahore Johar Town near terrorist Hafiz Saeed House – Whidbey Daily  News
    spot_img

    Trending Stories

    Related Stories