National

బాలీవుడ్ లో విషాదం.. చిన్నారి పెళ్లి కూతురు నటుడు ఊహించని విధంగా..!

బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ శుక్లా మృతి చెందాడు. 40 సంవత్సరాల వయసులో ఈ రోజు ఉద‌యం ఇంట్లో గుండెపోటుకు గురి కాగా, అతడిని కుటుంబ స‌భ్యులు కూప‌ర్ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఆయ‌న‌ను పరీక్షించిన వైద్యులు ఆయ‌న అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయాడ‌ని చెప్పారు. సిద్ధార్థ్ కు తల్లి, ఇద్దరు అక్కలు ఉన్నారు. సిద్ధార్థ్ ‘బాలికా వ‌ధు’ (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియ‌ల్‌ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. మోడల్ గా మొదలు పెట్టి 2008లో బుల్లితెర న‌టుడిగా త‌న కెరీర్‌ను ప్రారంభించాడు. 2014లో కరణ్ జొహార్ నిర్మించిన ‘హంప్టీ శర్మకి దుల్హానియా’ ఆయ‌న న‌టించిన తొలి చిత్రం. సిద్ధార్థ్ శుక్లా బిగ్‌బాస్‌ సీజన్‌ 13 విజేతగానూ నిలిచాడు. బిగ్ బాస్ 13లో గెల‌వ‌డంతో సిద్ధార్థ్ కు ఫాలోయింగ్ బాగా పెరిగింది. సిద్ధార్థ్ మృతి చెంద‌డం త‌మ‌ను షాక్ కు గురి చేసిందంటూ బాలీవుడ్ ప్ర‌ముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల‌ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరీ చిన్న వయసులోనే సిద్ధార్థ్ చనిపోయాడని అభిమానులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

40 ఏళ్ల వయసులో ఇలా హార్ట్ ఎటాక్‌తో మరణించడంపై అందరూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి పడుకునే ముందే ట్యాబెట్లు వేసుకున్నారని, గురవారం ఉదయాన హార్ట్ ఎటాక్ రావడంతో మరణించినట్టు కూపర్ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది. పలువురు బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

eight − two =

Back to top button