చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 133 మందితో ప్రయాణిస్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్‌స్ కు చెందిన విమానం కుప్పకూలింది. చైనాలోని గ్వాంగ్జి ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చైనీస్ స్టేట్ మీడియా ప్రకారం, మృతుల సంఖ్య, ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. బోయింగ్ 737 జెట్ విమానం పర్వత, అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకోవడానికి దారితీసింది.
BBC ప్రకారం విమానం ‘MU5735 స్థానిక సమయం 13:15 (05:15 GMT)కి కున్మింగ్ నుండి బయలుదేరి గ్వాంగ్‌జౌకు వెళుతోంది.’ విమానం గాలిలో కేవలం గంటసేపు మాత్రమే ఉంది. టెంగ్ కౌంటీలోని వుజౌ నగరానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (సిఎఎసి) ప్రకారం, ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. “బోయింగ్ 737 క్రాష్ అయిన తర్వాత చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ యొక్క సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజంను అలెర్ట్ చేసింది” అని CAAC తన ప్రకటనలో తెలిపింది. ఫ్లైట్‌రాడార్ 24 డేటా ప్రకారం చివరిగా లభించిన సమాచారం ప్రకారం విమానము స్థానిక కాలమానం ప్రకారం 14:22కి 3,225 అడుగుల ఎత్తులో వెళుతూ ఉంది.
ఈ విమానంలో 133 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. విమానం ఓ కొండపై కూలిపోగా, అక్కడ భారీగా పేలుడు సౌండ్ వచ్చినట్లు సంభవించింది. ప్రమాదం జరిగిన తీరు, విమానం కూలిపోయిన ప్రాంతం దృష్ట్యా అందులోని వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని భావిస్తున్నారు.